అత్రి బ్రహ్మమానసపుత్రులలో ఒకరు. బ్రహ్మ మనోశక్తితో జన్మించిన వాడు అత్రి. సప్తర్షులలో ప్రథముడు. అత్రి భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. అత్రిమహర్షి చేసిన ఘోరమైన తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు ఒకేసారి ప్రత్యేక్షమయ్యారు. త్రిమూర్తులు తనకు సంతానంగా జన్మించాలని అత్రిమహర్షి కోరుకున్నాడు. అప్పుడు ఆయనకు ముగ్గురూ కుమారులు జన్మించారు.
బ్రహ్మ అంశలో చంద్రుడు, విష్ణుమూర్తి అంశంలో దత్తాత్రేయుడు, శివుడి అంశంలో దూర్వాసుడు జన్మించారు.
అత్రి మహర్షి పేరుతో ఆత్రేయ ధర్మశాస్త్రము ఉంది. తొమ్మిది అధ్యాయాలున్న ఈ శాస్త్రంలో ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలున్నాయి.