header

Bharadwajudu

భరద్వాజ మహర్షి
Bharadwaja Maharshi భరద్వాజ మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. బృహస్పతి యొక్క కుమారుడు. ఇతని భార్య సుశీల. రామాయణంలో భరతుడు తన అన్నను అయోధ్యకు తిరిగి తీసుకురావడానికి అయోధ్య ప్రముఖులతో, మంత్రులతో, పురజనులతో, చతురంగ బలాలతో అడవికి బయలు దేరతాడు. భరధ్వాజ మహర్షి ఇతని భాతృభక్తిని పరీక్షించి, ప్రశంసించి భరతునితో పాటు వచ్చిన అందరికీ తన తపశ్శక్తితో షడ్రసోపోతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. శ్రీరాముడు వనవాస సందర్భంగా భరద్వజ దంపతులను దర్శించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటాడు. మహాభారతంలో కురుపాండవులకు గురువైన ద్రోణాచార్యుడు భరద్వాజని కుమారుడే.