భృగుమహర్షి ఒక గొప్ప జ్యోతిష్య శాస్త్ర పితామహుడు. ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత.
ఒకనాడు సరస్వతి నదీ తీరమున ఉన్న మహర్షుల మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సందేహం వస్తుంది. త్రిమూర్తుల గుణగణములు, ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు ఈ పనికి భృగువు మహర్షి కంటే గొప్పవాడు లేడు అని నిర్ణయించుకొని, తమ అభిప్రాయాన్ని భృగువుకు తెలియపరుస్తారు.
త్రిమూర్తులలోఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడం జరుగుతుంది. విష్ణువు ద్వారా తన అహంకారము నశించడం జరుగుతుంది భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు. విష్ణువే త్రిమూర్తులలో శ్రేష్టుడని తెలియజేస్తాడు.