header

Chyavana Maharshi

చ్యవన మహర్షి
చ్యవన మహర్షి భృగు మహర్షి కుమారుడు . ఇతని వృత్తాంతం మహాబారతం, దేవీ భాగవతం మరియు అష్టాదశ పురాణములొ చెప్పబడింది. చ్యవన మహర్షి సూర్య కుమారులైన అశ్వనీదేవతలకు యజ్ఞాలలొ హవిస్సులు, సోమరసాన్ని ఇప్పించాడు. ఈతని భార్య సుకన్య. మామ గారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైన శర్యాతి. వీరి కుమారులు ప్రమతి, దధీచి మరియు ఆప్రవానుడు.
శర్యాతి మహారాజుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటారు. కుమార్తె పేరు సుకన్య. ఈమె చాలా అందగత్తె. ఒక రోజు శర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబసమేతంగా వస్తాడు. ఆ సరొవరం దగ్గరలొ ఉన్న ప్రదేశంలో ఉన్న అడవిలొ భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. చాలా సంవత్సరాలు గడవటం వలన మహర్షి చుట్టూ చీమల పుట్టపెరుగుతుంది. ఆ మధ్యలో ఉండటం వలన మహర్షి కనబడేవాడు కాదు. శర్యాతి కుమార్తె సుకన్య కూడా వన విహారంలో చ్యవనుడు తపస్సు చేసుకొంటున్న పుట్ట వద్దకు వస్తుంది.
చ్యవన మహర్షి పుట్టలో ఉండటం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మిణుగురు పురుగు వలే కనిపిస్తాయి. సుకన్య అది ఒక పురుగు వలే ఉన్నదని తలంచి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. సుకన్య పుల్లతొ పొడుస్తుంది, దరదృష్టవశాత్తు, చ్యవనుడి కంటి చూపు పోతుంది. కంటి చూపు పోవడంతో చ్యవన మహర్షి కోపించి, శర్యాతి సైనికులకు, మంత్రులకు, శర్యాతికి మలమూత్రాలు రాకుండా చేస్తాడు. మలమూత్రాలు రాక ఇబ్బంది పడుతున్న వారిని గమనించి విచారిస్తున ఉన్న శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి తెలిపరుస్తుంది.
అప్పుడు విషయం గ్రహించిన శర్యాతి సకల పరివారంతో అడవి వెళ్లి మహర్షిని కలిసి జరిగినది చెప్పి మన్నించమని వేడుకుంటాడు. అప్పుడు చ్యవన మహర్షి శాంత చిత్తుడై తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్యాతి కుమార్తె సుకన్య అని తనకిచ్చి వివాహం జరపమంటాడు.
దానికి శర్యాతి సంకోచిస్తుంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగిందని ఆ అపచారం చ్యవన మహర్షిని సేవించడం ద్వారానే తీరుతుందని తండ్రితో తెలిపి తన వివాహం చ్యవన మహర్షితో జరపమని కోరుతుంది.
వివాహం జరిగాక చ్యవన మహర్షి ఆశ్రమానికి నార చీరలు కట్టుకొని చేరుతుంది. పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకొంటుంటుంది. తరువాత సుకన్య పాతివ్రత్య మహత్యంతో అశ్వనీ దేవతలు చ్వవనుణ్ణి యౌవ్వనవంతుడిగా చేస్తారు.