భార్గవ వంశంలోని సుకన్య, చ్యవన మహర్షుల పుత్రుడు దధీచి. లోక రక్షణకు తన ప్రాణాలను తృణప్రాయంగా తలచి అర్పిస్తాడు.
ఇంద్రుడు ధధీచికి అనేక మహా అస్త్రాలను, బ్రహ్మవిద్యను నేర్పతాడు. అయితే వీటిని దధీచి మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధిస్తాడు. అలా నేర్పితే దధీచి శిరస్సును ఖండిస్తానని చెబుతాడు.
అశ్వినీ దేవతలు దధీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందిగా అర్థిస్తారు. దధీచి అందుకు అంగీకరించాడు. అయితే ఇంద్రుడు విధించిన నిబంధనను వారికి తెలియచేస్తాడు. శస్త్రవిద్యా నిపుణులైన దేవ వైద్యులు దధీచి తలను తామే ఖండించి, ఒక అశ్వం యొక్క శిరస్సును ధధీచికి అమరుస్తారు, తరువాత ధధీచి నుండి మహాశాస్త్రాలను నేర్చుకుంటారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దధీచి అశ్వశిరస్సును ఖండిస్తాడు. వెంటనే అశ్వనీ దేవతలు తాము భద్రపరిచిన దధీచి అసలు శిరస్సును తిరిగి అతికిస్తారు.
దానితో దేవతలందరూ దధీచి దగ్గరకు వెళ్లి వాళ్ళ కోరికను విన్నవించుకుంటారు. దధీచి, తన వల్ల కోకానికి మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ళ కోరికను మన్నిస్తాడు. అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలనీ ఉందని ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు నైమిశారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దధీచి కోరికను తీరుస్తాడు.
ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరమున్నందువల్ల దధీచి తన ప్రాణాలని వదులుతాడు. అప్పుడు కామదేనువు వచ్చి దధీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది. అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుడిని చంపుతాడు ఇంద్రుడు.