header

Durvasa Maharshi

దుర్వాస మహర్షి
ఇతడు అత్రి మహర్షి, అనసూయల పుత్రుడు. చాలా ముక్కోపి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఈ మహర్షిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
అంబరీషుని కథ
అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. ఆయన ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి నారాయణుని మెప్పించి సుదర్శన చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల ఆయన రాజ్యం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతూ ఉంటుంది. సుదర్శన చక్రం రాజ్యాన్ని శత్రువుల బారినుంచి కాపాడుతూ ఉంటుంది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహిస్తాడు. ఈ వ్రతం ప్రకారం ఆయన ఏకాదశి ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి రోజున ముగించి అతిధులందరికీ భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే దుర్వాసుడు అతిధిగా వస్తాడు. దుర్వాసుడు స్నానానికి నదికి వెళ్ళటంతో, ఉపవాసం ముగించే గడియలు ముగిసిపోతుండటంతో మధ్యేమార్గంగా భోజనం చేయకుండా జలపానం చేసి వ్రతం ముగిస్తాడు. తరువాత దుర్వాసుడు వచ్చి తన రాకుండానే జలపానంచేసిన అంబరీషునిపై కోపించి ఒక రాక్షసుని అంబరీషునిపైకి పంపిస్తాడు. ఆ రాక్షసుడు అంబరీషునిపైకి రాగా, సుదర్శనచక్రం అంబరీషునికి రక్షణగా వచ్చి దుర్వాసునిమీదకు వస్తుంది. దుర్వాసుడు భయంతో ముల్లోకాలు తిరిగి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరతాడు. కానీ తాము సుదర్శన చక్రం బారినుండి అతనిని కాపాడలేమని అంబరీషుణ్ణే శరణుకోరమని చెబుతారు. దుర్వాసుడు అంబరీషుని శరణు కోరగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ఆపుతాడు,
దుర్వాసుడు తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారిని వరాలతో అనుగ్రహిస్తాడు. భారతకథలోని కుంతీదేవి చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు వీరిదగ్గరకు అతిథిగా వస్తాడు. దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు కుంతిభోజుడు. కుంతీ దుర్వాసునికి ఓర్పుతో సేవలు చేస్తుంది. కుంతి సేవకులకు దుర్వాసుడు సంతసించి ఆమెకు అథర్వణవేదం లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే రప్పించుకొనే వరం పొందుతుంది. పెళ్ళి కాక మునుపే మంత్రాన్ని పరీక్షింపగోరి, సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానంగా పొందుతుంది. కానీ అవివాహిత కావడంతో ఏమి చేయాలో తోచక ఆ బిడ్డను చిన్న పెట్టెలో ఉంచి నదిలో వదిలి పెడుతుంది.
ఈ మంత్ర ప్రభావంతోనే కుంతి యమధర్మరాజు వలన ధర్మరాజును, వాయుదేవుని వలన భీముడిని, ఇంద్రుడి వలన అర్జునుని సంతానంగా పొందుతుంది.