header

Kasyapa

కశ్యపుడు
కశ్యపుడు బ్రహ్మ కొడుకు. ప్రజాపతులలో ముఖ్యుడు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలుంటారు వీరిలో దితి, అదితి, వినత, కద్రువ మొదలైనవారు. ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు బోధిస్తాడు. పరశురాముడు కశ్వపునికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కశ్యపుని వంశవృక్షం
కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగాపరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగాపేరుపొందినది. తరువాత ఇదే వంశంలో దశరధునికి శ్రీరాముడు జన్మిస్తాడు. కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు మరియు సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించినది.
కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు మరియు అనూరుడు (సూర్యుని రథసారధి) జన్మిస్తారు. కద్రువ వలన నాగులు జన్మిస్తారు
భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని అనే భార్య వలన అప్సరసలు జన్మిస్తారు.