header

Markandeyudu

మార్కండేయుడు
మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. అల్పాయుష్కడవడంతో శివుని ప్రార్థించి చిరంజీవత్వాన్ని పొందుతాడు. మార్కండేయుని తల్లిదండ్రలుని వారణాశిలో వారు రెండు శివలింగాలను ప్రతిష్ఠించి, శివుని గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు వీరి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని పరీక్ష చేయడానికి, సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుదైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని అలాగే అని పల్కి అదృశ్యమౌతాడు.
మహాదేవుని వరం వల్ల మరుద్వతి గర్భవతి దివ్యతేజస్సు కలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల అతనికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు. ఏడు సంవత్సరాలు మూడు నెలలు తరువాత మార్కండేయుడికి ఉపనయనం చేస్తారు. రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షి చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్తఋషులకు నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవ అని దీవిస్తారు. మృకండు మహర్షి ఇది విని తనకొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడుగగా సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి యముని జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొనిపొయి బ్రహ్మ చేత కుడా చిరంజీవి అని దీవింపచేస్తారు. ఆ తరువాత దివ్యదృష్టితో మృకండు మహర్షికి శివునికి యమునుకి మధ్య జరిగిన సంవాదం తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెబుతాడు
16 సంవత్సరాలు నిండిన తరువాత రోజున యముడు తనకింకరులను మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన వాహనమైన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తుంటాడే. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించి కరుణించమంటాడు. శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవాడివి అని అంటాడు. ఇప్పటికి కూడా మార్కండేయిడు చిరంజీవిగా ఉన్నాడని అంటారు.