మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలంగా ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ దురద పోవడానికి తమ శరీరాన్ని రుద్దుతుండేవి.
మృగముల కండుయాన్ని(దురదను) తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు.
మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వీరికి సంతానం ఉండదు. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశికి చేరుకుంటారు. శివానుగ్రహంచే మార్కండేయుడనే పుత్రుని పొందుతారు.
అల్పాయిష్కుడైన ఈ మార్కండేయుడే శివుని అనుగ్రహంతో చిరంజీవగా వరం పొందుతాడు.