పులస్త్యుడు బ్రహ్మయొక్క మానసపుత్రుడు. ఒక ఆశ్రమంలో ప్రశాంతంగా తపస్సు చేసుకొంటుంటాడు. తన తపస్సుకు భంగం కలగకుండా తన ఆశ్రమమం వైపు ఎవరైనా స్త్రీలు వస్తే వారు గర్భవతులు అవుతారని శపిస్తాడు.
ఈ శాపం గురించి తెలియని తృణబిందు రాజర్షి అనే రాజు కుమార్తె ఇద్విద ఆ ఆశ్రమ సమీపానికి వచ్చి గర్భవతి అవుతుంది. దుఃఖిస్తూ తండ్రి దగ్గరకి వెళ్లి విషయాన్ని చెపుతుంది. విషయం తెలుసుకున్న మహారాజు పులస్త్యుడి దగ్గరకి వచ్చి తన కూతురిని పెళ్లి చేసుకోమని అభ్యర్దిస్తాడు. అతని మాటను గౌరవిస్తూ పులస్త్యుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోనే ఉంటూ మహర్షికి సేవ చేస్తూ ఉండేది. వారికి విశ్రవసు అనే కుమారుడు పుడతాడు.
ఈ విశ్రవసువు కైకసి అనే రాక్షస స్త్రీని వివాహమాడతాడు. వీరికి రావణాసురుడు విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ పుడతారు. పులస్త్యుడు రావణాసురునికి తాతగారు.