header

Vedavyasa

వేదవ్యాసుడు
vedavyasa వేదవ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఒక్కటిగా ఉన్న వేదాలను నాలుగుభాగాలుగా విడకొట్టటం వలన ఇతనని వేదవ్యాసునిగా పిలుస్తారు. వేదాలతో పాటు మహాభారతం, భాగవతం,అష్టాదశపురాణాలు రచించాడు
మహాభారతంలో వేదవ్యాసుని జననం గురించి తెలుపబడింది.
పూర్వకాలములో ఛేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను కూడా తపస్సు చేయడం ఆరంభిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి వచ్చివెళ్ళమని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుష్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము కూడా ఉన్నది. శుక్తిమతి మీద మోజుపడి కోలాహలుడు ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కనపడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని భ్రమపడి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సును మ్రింగుతుంది. దీని వల్ల అది అండంతో కూడి పిండంగా రూపుచెందుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా వారికి ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోయి అతనికిస్తారు.
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అప్సరస చేపగా మారి యమునా నదిలో ఉంటుంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. చేపకడుపునుంచి వచ్చిన మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో దాశరాజు త పెరుగుతుంది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి (శక్తి కుమారుడు) పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.
పడవ ఎక్కిన పరాశరుడు మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన ఎడల తాను తన తండ్రికి ఏవిధంగా సంఘంలో బతకగలనని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి ఆమె యోజన గంధిగా పేరు పొందింది. అప్పటికీ రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట ఎలా రతికి పాల్పడటం అనే విషయంలో సందేహపడుతుంటే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే పెద్దవాడై తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లి ఎప్పుడైన తనను తలచుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.