header

Yagnavalka Maharshi

యాజ్ఞవల్క్య మహర్షి
yagnavalka maharshi యాజ్ఞవల్క్య మహర్షి మహర్షులలో విలక్షణుడు యాజ్ఞవల్క్య మహర్షి. గురువైన వైశంపాయనుడికి శాపవిమోచనం చేసిన తాపసి. రుషులలో ఆగ్రగణ్యుడై, నేటి న్యాయశాస్త్రానికి మూలమైన అద్భుత యాజ్ఞవల్క్య సృతిని మనకు అందించిన మహనీయుడు. కర్మ జ్ఞాన మార్గాలే మోక్షానికి దారి అని తెలియపరిచినవాడు యాజ్ఞవల్క్యడు. సప్తర్షుల సన్మానాన్ని అందుకున్న యోగీంద్రుడు
సమస్త విద్యలూ అభ్యసించి, నాలుగు వేదాలూ నేర్చుకొని విద్యానిధియై మహారుషులచేత యోగీంద్ర పట్టాభిషేకం జరిపించుకున్న పరమయోగీశ్వరుడు యాజ్ఞవల్క్యడు. ఈయన తల్లితండ్రులు సునంద, యాజ్ఞవల్క్యలు. ఈ మహర్షి బాష్కలుని దగ్గర రుగ్వేదం, జైమిని మహర్షి దగ్గర సామవేదం, తరుణి దగ్గర అధర్వణవేదం అభ్యసించాడు. తర్వాత వైశంపాయనుడి శిష్యుడై యజుర్వేదం అధ్యయనం చేశాడు.
గురువును మించిన శిష్యుడు
వైశంపాయనుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాదోషం నుండి బయటపడే మార్గం సూచించమని శిష్యులను అడుగుతాడు. అందుకు నేనొక్కడినే సమర్ధుడునని యాజ్ఞవల్క్యడు చెప్పగానే ఆగ్రహించిన గురువు నేను నేర్పిన విద్యను తిరిగి ఇచ్చేయవలసిందిగా ఆదేశిస్తాడు.
యాజ్ఞవల్క్యడు గురువును మన్నించమని కోరి తన తపశ్శక్తితో వైశంపాయనుడి బ్రహ్మహత్యా దోషం తొలగిస్తాడు. అంతేకాకుండా గురువు నేర్పిన విద్యను రుధి రూపంలో విడచి వెళ్ళిపోతాడు. పదార్ధాన్ని తిత్తిరి పక్షులు తింటాయి. వాటి పలుకులే తైత్తిరీయ ఉపనిషత్తుగా రూపుదాల్చింది, తర్వాత యాజ్ఞవల్క్యడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదం నేర్చుకొని గురువుని మించిన శిష్యుడయ్యాడు. సరస్వతీ దేవిని ఉపాసించి సమస్త విద్యలు అభ్యసించాడు. కతుడను మహర్షి కుమార్తె కాత్యాయనిని గార్గి శిష్యరాలైన మైత్రేయిని వివాహం చేసుకున్నాడు. వీరికి చంద్రకాంతుడు, మహామేఘుడు, విజయుడను కుమరులు జన్మించారు.
మహతపస్వి
జనక మహారాజు ఒక యాగం చేస్తాడు. యాగానంతరం రుషులలో గొప్పవారు ఎవరో వారు మాత్రమే ధనరాసులతో కూడిన తాంబూలం స్వీకరించేందుకు ముందుకు రావాలని కోరారు. అక్కడున్న వారెవరూ ముందుకు రారు. దాంతో యాజ్ఞవల్క్యడు తన శిష్యులను తాంబూలం తీసుకొమ్మని ఆజ్ఞాపిస్తాడు. యాజ్ఞవల్క్యని తరపున ఆయన శిష్యులు తాంబూలం స్వీకరిస్తారు. విప్రకూటమి శౌకల్యుడి లాంటి రుషులు విషయంలో యాజ్ఞవల్క్యనితో వాదించి ఓడిపోతారు. జనకునిచే అందరికన్నా గొప్పవాడిగా పూజలందుకున్న యాజ్ఞవల్క్యడు ఆయనకు బోధచేశాడు. విశ్వావసుడనే గంధర్వుడు సైతం యాజ్ఞవల్క్యని దగ్గరకు వచ్చి తత్త్వోపదేశం పొందుతాడు. యాజ్ఞవల్క్య స్మృతి భారతీయ న్యాయశాస్త్రం న్యాయశాస్త్రానికి ఆధారమైన స్మృతిగ్రంధాన్ని భారతీయులకు అందించిన మహామహుడు యాజ్ఞవల్క్యడు ఇతను గొప్ప స్మృతికర్త. న్యాయశాస్త్రానికి ఆధారమైన ధర్మసూక్ష్మములను ఈనాటి సమాజానికి, న్యాయ వ్యవస్థకు పయోగపడేలా ఆయన చేసిన రచన యాజ్ఞవల్క్య స్మృతిగా ప్రసిద్ధి చెందినది.
యాజ్ఞవల్క్య స్మృతిలో లోకవ్యవహారంలో అవసరమయ్యే మెళకువలన్నీ వివరంగా నిర్వచించాడు. న్యాయ పరిష్కర్తగా నిలిచాడు. యాజ్ఞవల్క్యడు ఆచారధ్యాయం, వ్యవహారాధ్యయం, ప్రాయశ్చిత్తాధ్యాయం అనే మూడు అధ్యాయాలలో సమస్త విషయ చర్చతో కూడిన సామాజిక వ్యవస్థను అవిష్కృతం చేసింది. యాజ్ఞవల్క్యడు స్మృతి న్యాయధర్మాలను సూచించే న్యాయశాస్త్ర దర్పణం అయిన స్మృతిని అందించిన యాజ్ఞవల్క్యస్మృతి, ఈ మహర్షి మహా యోగీశ్వరులకే అద్భుతంగా వివరించిన యోగ ప్రవచనం యోగయాజ్గ్న వల్క్యం. యోగశాస్త్రం పేరిట ప్రచారం వ్యవస్థకు నిర్వచనం చెప్పిన న్యాయమూర్తి, మహర్షి, మహాతత్త్వవేత్త యాజ్ఞవల్క్య రుషి చరితం ఆదర్శపథం, అనుచరణ యోగ్యం.
.......ఇట్టేడు అర్కనందనాదేవి సౌజన్యంతో....