header

Shirdi Sai Baba.....షిర్ది సాయిబాబా

"అందరి దైవం ఒక్కరే. మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే". షిర్ది సాయిబాబా“
దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు’’ - షిర్ధిసాయి సాయిబాబా
షిర్ది సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం గురించి వివరాలు లభ్యం కావటం లేదు. అసలు పేరుకూడా తెలియదు. సాయిబాబాను ముస్లిం మతస్థలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా తన జీవితంలో రెండు మతాలను అవలంభించి వీరి మధ్య సహయోగము కుదర్చడానికి ప్రయత్నం చేశాడు. సాయిబాబా నివాసం పాడుపడిన మసీదులో, సమాధి చెందింది గుడిలో. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు మతాల

సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. సాయి సూక్తులలో అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (అందరికి ప్రభువు ఒక్కడే). హిందూ సంప్రదాయానికి చెందినవారు సాయిబాబాను దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
తన సుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (సుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చాంటరు. ఈ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు.
మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని అంటారు.
1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి“ఆవో సాయి” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి అతడు "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు. షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు. ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.

తరువాత పేజిలో ...............