ఒక ముస్లింకు సంతానం కలిగితే శిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. సాయి అతనిని అల్లా అచ్చా కరేగా అని దీవించారు. కొంత కాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు.”వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయి పంచు” అన్నారు.మారుతీ ఆలయం లో మిఠాయి పంచి తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతనిని కౌగలించుకొని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు.
"ఖురానును చదవగానే సరి కాదు, అందులోని సారాంశాన్ని వంట పట్టించుకొని ఆచరించాలి.
షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ ఆధ్వర్యంలో షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది. నిత్యం అన్న సంతర్పణ జరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింపబడుతున్నది. అయితే సాయిబాబా ఆరాధన కార్యక్రమాలలో కొన్ని మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వంలో నడుస్తున్నాయి. అధికంగా భక్తులు, స్థానిక ప్రజలు వారి సంకల్పానుసారం పూజలు, ఆలయాలు, అన్న సంతర్పణలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
భారత దేశమే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు ఆరాధనా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు.
షిరిడీలోని సాయిమందిరానికి సగటున రోజూ 30 వేల మంది సందర్శకులు వస్తారని. ప్రత్యేక సందర్భాలలో, పండుగ దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుంది
దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, ఖండ యోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, గాలిలో తేలి ఉండడం, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలిసికోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి సాయి చూపిన మహిమలలో కొన్ని.
తన భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా బాబా అనేక మంది భక్తులకు కలలలోను, మనోధ్యాన సమయంలోను దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేయడం, కష్టాలనుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరచినట్లు చాలా మంది భక్తులు చెబుతుంటారు. ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాలలో తరచు చెప్పబడతాయి.
షిర్డీ సాయిబాబా నిరాడంబర జీవితం గడిపారు. సాయిబాబాకు మసీదే మహలు. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా తలచేవారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.
మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి నాలుగు అడుగులు వేస్తాడు.
షిర్థికి ప్రయాణ సౌకర్యాలు, వసతి, భోజన సౌకర్యాలు, దర్శనసమయాలు, షిర్థీలో చూడవలసిన ప్రదేశాలు మొదలగు అన్ని
వివరాలకు
తెలుగుకిరణం.కామ్ దర్శించండి