బాబా ఆమ్టే ప్రముఖ సంఘసేవకుడు. కుష్టువ్యాధి రోగులకోసం పూనేకు సమీపంలో ఆశ్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలోని చివరివరకు గడిపాడు. వీరి పూర్తిపేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. బాబా అనేది వీరి తల్లిదండ్రుల పెట్టిన ముద్దుపేరు.
ఈ మహనీయుడు 1914 డిసెంబర్ 26వ తేదీన మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగస్ ఘాట్ లో జన్మించారు. న్యాయశాస్త్రం చదువుకొని న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. ఇదే సమయంలో భారత స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుపాలైన జాతీయ నాయకుల తరపున వాదించేవాడు. క్రమంగా గాంధీవైపు ఆకర్షితుడయ్యడు. గాంధీ సిద్ధాంతలకు కట్టుబడి జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికై కృషి చేసారు.
1951లో తొలిసారిగా ‘ఆనందవన్’ అనే ఆశ్రమాన్ని కుష్టురోగులకోసం ప్రారంభించారు. నేడు ఈ ఆశ్రమం 500 ఎకరాలకు విస్తరించింది. తరువాత సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించారు. ఆనందవన్లో రెండు ఆసుపత్రులు, ఒక విశ్వవిద్యాలయం, అంధుల పాఠశాల, ఒక అనాధ శరణాలచం ఉన్నాయి.
94 సంవత్సారాల వయసులో 2008 ఫిబ్రవరి 9వ తేదీన ఆనందవన్ ఆశ్రమంలో మరణించారు.
ఈయనకు గాంధీ శాంతిబహుమతి, రామన్ మెగసేసే ఆవార్డులు లభించాయి. భారతదేశపు అత్యున్నతపు పురస్కారాలు ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’ లభించాయి..