header

Eswarachandra Vidyasagar..ఈశ్వర చంద్ర విద్యసాగర్

Eswarachandra Vidyasagar..ఈశ్వర చంద్ర విద్యసాగర్
రాజరామ మోహన్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన సంఘ సంస్కర్త, గొప్ప సంస్కృత పండితుడు, విద్యావేత్త. కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. 1820 పెప్టెంబర్ 26వ తేదీన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు.
ఇతను వయసును మించిన బుద్ధికుశలత కలిగిన వాడు. స్కూలు చదువును కేవలం మూడుసంవత్సరాలలో ముగించాడు. తరువాత సంస్కృత పాఠశాలలో చదువుకున్నాడు. ఇతని అసలు పేరు ఈశ్వరచంద్ర. విద్యాసాగర్ అనేది ఇతని విద్యత్తుకు లభించిన బిరుదు.
విప్లవవాదులలో ఉండే ఉద్రేకం ఇతనిలో కనబడేది. కానీ అదే సమయంలో సంస్కరణవాదిగా సహనం ప్రదర్శించేవారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు వివాహాలను శాష్త్రపరంగా సరియైనవని నిరూపించగలిగాడు. బాలికలు విద్యాలయాలను ప్రారంభించారు. విద్యతో సమాజంలో సమగ్రమైన మార్పు తీసుకు రావాలన్నదే వీరి ఉద్యమం. వివాహానికి కనీస వయసు నిర్ణయం వీరి సంస్కరణల నుండి వచ్చినదే. బహుభార్యత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినపుడు ఉన్నత వర్గాలనుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది.
సామాజిక సంస్కరణలలో విప్లవాత్మక పంధాను అనుసరించాడు.
కుటుంబ సమస్యలు, బయటి సమస్యలతో అనారోగ్యం పాలై1891 జులై 29న కన్ను మూసారు.