వల్లం కాలి అని పిలువబడే సంప్రదాయ బోటు రేసులు కేరళలో ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ పడవలను పొడవుగా ఉండి కేవలం తెడ్డులు వేస్తూ ఉరికిస్తారు.
పంటల పండగగా చెప్పబడే ఓనమ్ పండుగ సందర్భంగా ఈ పడవపందేలు జరుపుకుంటారు. సాధారణంగా సెప్టెంబర్ లేక అక్టోబర్ నెలలలో ఈ పండుగ వస్తుంది. పాము ఆకారంలో పొడవుగా ఉంటే బోటు రేసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.