రాజస్తాన్ లో పుష్కర్ లో ప్రతి ఏటా నవంబర్ లో జరిగే ఒంటెల మేళాను చూడడానికి పర్యాటకులు పుష్కర్ చేరుకుంటారు. వారం రోజులు జరిగే ఉత్సవాలకు సుమారు నాలుగున్నర లక్షల మంది వస్తారని అంచనా. మేళాలో ఒకవైపు ఒంటెల క్రయవిక్రయాలు సాగితే.. మరోవైపు ఆటపాటలు అందరినీ అలరిస్తాయి. భారీ రంగుల రాట్నాలు, ఒంటెలపై స్వారీలు, కళాకారుల ప్రదర్శనలు, జానపదుల గళవిన్యాసాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రాజస్థానీ రుచుల ఘుమఘుమలు మరపురాని ఆతిథ్యాన్ని అందిస్తాయి. పుష్కర్ లోనే ఉన్న బ్రహ్మదేవుడి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. భారతదేశంలో ఉన్న ప్రముఖ బ్రహ్మదేవుని పుణ్యక్షేత్రం. ఏడాది పొడవునా యాత్రికులు వస్తుంటారు.