శ్రీకృష్ణదేవరాయల చారిత్రక వైభవాన్ని ప్రదర్శించే హంపి వేడుక. ఏటా నవంబరు మొదటి వారంలో జరుగుతుంది.
రాచనగరిలోని వీధులన్నింటినీ అందంగా అలంకరిస్తారు. సైనికుల కవాతులు, గజరాజుల ఊరేగింపులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోతుంది. నృత్య, నాటక ప్రదర్శనలు, తోలుబొమ్మలాటలు రాయల చరితను కళ్లముందుంచుతాయి.
విజయవాడ, విశాఖపట్నం నుంచి హోసపేటకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో12 కి.మీ దూరంలో ఉన్న హంపికి వెళ్లవచ్చు.