header

Hornbill Festival…Nagaland…హార్న్ బిల్ ఫెస్టివల్ - నాగాలాండ్

Hornbill Festival…Nagaland…హార్న్ బిల్ ఫెస్టివల్ - నాగాలాండ్
Hornbill Festival…Nagaland…హార్న్ బిల్ ఫెస్టివల్ - నాగాలాండ్ నాగాలాండ్ పల్లెల్లో తరచూ వేడుకలు జరుగుతుంటాయి. హార్న్ బిల్ ఫెస్టివల్ కు హాజరైతే గిరిజన సంప్రదాయం, సంస్కృతి గొప్పదనం తెలుసుకోవచ్చు. నాగావాసులు తమ పూర్వీకుల వైభవాన్ని ఎలా కాపాడుకుంటున్నారో తెలుస్తుంది.
భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులంతా ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. ఆటపాటలతో అడవితల్లిని ఆరాధిస్తారు. సంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శిస్తూ.. వారసత్వాన్ని భావితరాలకు అందిస్తారు
కోహిమా సమీపంలోని నాగా హెరిటేజ్ గ్రామంలో జరిగే ఈ ఉత్సవాన్ని చూసేందుకు విదేశాల నుంచీ కూడా పర్యాటకులు వస్తారు. ఉత్సవ తేదీలు డిసెంబరు 1 నుంచి 10 వరకు ఎలా వెళ్లాలి కోల్ కతా నుంచి డిమాపుర్ కు విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోహిమాకు వచ్చు. దిల్లీ, కోల్ కతా, గువాహటి నుంచి డిమాపుర్ కు రైళ్లున్నాయి.