ఏటా జరిగే జైపూర్ ఫెస్టివల్ ను చూసేందుకు భారతదేశంనుండే కాకుండా విదేశీ పర్యాటకులు సైతం వస్తారు.
నెల రోజులు జరిగే ఫెస్టివల్లో చెక్కతో చేయబడిన కళాకృతులు, ఫర్నిచర్, రత్నాలు, ఆభరణాలు, చీరలు, హస్తకళాకృతులు,చేతితో అల్లబడిన బ్యాగ్ లు, గాజులు, మట్టితో చేయబడ్డ వస్తువులు, బొమ్మలు ఇలా ఎన్నో వస్తువులును ప్రదర్శించి అమ్ముతారు.
అడుగడుగునా రాజస్థానీ సంప్రదాయం పలకరిస్తుంది. రాజస్ధాన్ వంటకాలను రుచి చూడవచ్చు.
జైపుర్ అంగళ్ల తో పాటు రాజస్థాన్ లోని పర్యాటక కేంద్రాలను కూడా చూడవచ్చు.