header

Konark Festival…కోణార్క్

Konark Festival…కోణార్క్
ప్రతి సవంత్సరం డిసెంబరులో కోణార్క్ లో అద్భుతమైన నృత్యోత్సవం జరుగుతుంది. ప్రముఖ కళాకారులు ప్రదర్శించే భారతీయ సంప్రదాయ నృత్యరీతులన్నీ చూడటం కోసం ఎందరో కోణార్క్ వెళతారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రతి సాయంత్రం కళారాధనే. ప్రతి నిమిషం కూడా విలువైనదే.
ఇదే సమయంలో పూరి బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. దేశదేశాలకు చెందిన సుప్రసిద్ధ సైకత శిల్పులు తమ ఆలోచనలకు అనుగుణంగా పూరి తీరంలో ఇసుకతోరూపం కల్పిస్తారు . ఇందులో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పడవ పందేలు, కబడ్డీ పోటీలు, బీచ్ పార్టీలు, ఫ్యాషన్ షోలు జరుగుతాయి
తేదీలు : డిసెంబర్ 1 వ తేదీనుండి 5వ తేదీ వరకు
ఎలా వెళ్లాలి ...? విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నుండి ఖుర్ధా రోడ్ జంక్షన్ వరకు వెళ్లి అక్కడనుండి 59 కి.మీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. ఒడిషాలోని భువనేశ్వర్ కు విమానాల ద్వారా వెళ్లి అక్కడనుండి రోడ్డు మార్గంలో కోణార్క్ కు వెళ్లవచ్చు.