చేయదగిన వారు :
ఆరోగ్యవంతులైన 18 నుండి 55 సంవత్సరాల వయసున్న వారు రక్తదానం చేయవచ్చు. మగవారైతే ప్రతి మూడునెలలకు ఆడవారైతే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును. కొన్ని ప్రమాణాల ఆధారంగా రక్తదాతలు :
12.5 జి / డి.ఎల్ కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్ వున్నవారు. నాడి కొట్టుకునే వేగం నిమిషానికి 50 - 100 మధ్య వున్నవారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా వున్నవారు. బరువు 46 కిలోల కన్నా ఎక్కువ వున్నవారు.
రక్తదానం చేయకూడని వారు :
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, గర్భస్రావం అయినవారు, నెలసరిలో ఉన్న స్త్రీలు.
స్థిరాయిడ్లు, హార్మోన్ మందులు, ఏవైనా ప్రత్యేక మందులు వాడుచున్నవారు.
హెచ్.ఐ.వి / లైంగిక వ్యాధులు / ఇన్‌ఫెక్షన్లు వున్నవారు. మాదకద్రవ్యాలు సేవించేవారు.
మలేరియా. టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు వున్నవారు.
గత ఆర్నెల్ల కాలంలో ఆపరేషన్లు చేయించుకున్నవారు.
రక్తదానానికి ముందు24 గంటల సమయంలో మద్యం త్రాగినవారు.
అపోహలు : రక్తదానం చేసిన తరువాత హోమోగ్లోబిన్ పడిపోతుందని అపోహ. ఒకసారి 470 మి.లీ. కంటే తక్కువే తీసుకుంటారు కాబట్టి మన శరీరం ఈ రక్తాన్ని త్వరగానే భర్తీ చేసుకుంటుంది.
రక్తదానానికి ఎక్కువ సమయం పడుతుందని కొందరి అపోహ. కాని గంటకన్నా ఎక్కువ సమయం పట్టదు.
రక్తదానం చేసిన తరువాత ఎలాంటి అనారోగ్యం తలెత్తదు. కొన్నిగంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.
రక్తదానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు వస్తాయని చాలామంది భయపడతారు. కాని శుభ్రమైన (స్టెరిలైజ్డ్) పరికరాలు వాడితే ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు.