Dr. Ch. Mohan Vamsi, Chief Surgical Oncologist, Omega Hospitals, Hyderabad. Phone : 98480 11421
క్యాన్సర్ కణం పుట్టుకకు ఖచ్చితంగా కారణం ఇది అని తెలియక పోయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన అలవాట్లు చేసే వృత్తి, వాతావరణ కాలుష్యం రకరకాల ఇన్‌ఫెక్షన్లు, అధిక బరువు, మితిమీరిన హార్మోన్ల వాడకం, వయస్సు పైబడటం, వంటివి కారణం కావచ్చు. వయస్సు పైబడే కొద్దీ వచ్చే క్యాన్సర్ మెల్లగా పెరిగితే, యుక్త వయస్సులో వచ్చే క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ట్రీట్‌మెంట్ వయస్సును బట్టి మారుతుంటుంది.
ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకున్నా ఫ్రెండ్స్, పార్టీలు, పబ్ కల్చర్‌తో స్మోకింగ్ పెరుగుతోంది. ఆల్కాహాల్ స్త్రీ, పురుషులు అన్న బేధం లేకుండా తీసుకోవటం వలన, అంతే కాకుండా ఇవేవి లేకపోయినా వారంలో రెండు, మూడుసార్లు బయట హోటల్స్‌లో రకరకాల ఆహార పదార్థాలు ప్రయత్నించటంలో భాగంగా బాగా ఫ్రై చేసిన ఐటమ్స్, కలర్‌పుల్‌గా ఉండే ఆహారపదార్థాలు, కొవ్వు ఎక్కువగా కలిపిన పిజ్జాలు, బర్గర్‌లు, బిరియానీలు కూడా కాన్సర్ కారకాలుగా మారుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వీటితోపాటు ఇంట్లో పెంపుడు జంతువులకు, మనుషులు వాడే రకరకాల కాస్పోటిక్ ప్రోడక్ట్స్, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు త్వరగా పండటానికి, ఎక్కువగా కలర్‌ఫుల్‌గా ఉండటానికి వాడే అనేక రకాల రసాయనాలు కూడా క్యాన్సర్ కారకాలు
HIV, HEP B వైరస్ లు రాకుండా వ్యాక్సిన్స్ తీసుకోవటం, పళ్లు, కూరగాయలను ఉప్పునీటితో కడగటమూ, బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందే తెలిపే స్క్రీనింగ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందే పసిగట్టే ప్యాప్‌స్మియర్ చెకప్, పురుషులో 50 ఏళ్లు పైబడితే ప్రొస్టేట్ గ్రంధి కాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ కాబట్టి ముందుగానే పి ఎస్ ఎ పరీక్ష చేయుంచు కోవటం మంచిది. ఒత్తిడి తగ్గిస్తాయనో, లేదా స్నేహితుల కోసం అలవాటు చేసేకునే స్మోకింగ్, ఆల్కాహాల్ వలన లంగ్ క్యాన్సర్‌కు, లివర్ క్యాన్సర్‌కు దారి దగ్గరవుతుందని అందరూ గమనిస్తే చాలా మంచిది.
సంతాన భాగ్యం పొందని దంపతులు ఎక్కువ కాలం పాటు ఫెర్టిలిటీ మందులు వాడితే, మరీ ముఖ్యంగా స్త్రీలు ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ కాంబినేషన్‌లో మందులు దీర్ఘకాం పాటు వాడితే రొమ్ము సంబంధిత, అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్‌కు గురవటం గమనిస్తున్నాము. న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర రేడియేషనకు గురవటం కాని, చిన్న వయస్సులో క్యాన్సర్‌కు కీమో, రేడియో థెరపీ ఎక్కువ మోతాదులో ఇవ్వటం వలన క్యాన్సర్స్ తిరగబెట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది.
జంతువులకు, మొక్కలకు, మనుషులకు ఇలా జీవం ఉన్న ఏ కణజాలం అయినా క్యాన్సర్‌కు గురవ్యవచ్చు. ఆ కణంలో డి ఎన్ ఏ మ్యుటేషన్ చెంది అపరిమితంగా పెరిగి పోవటమే క్యాన్సర్. ఇలా జరగటానికి జెనెటిక్స్ కూడా దోహదం చేయవచ్చు. అందుకే కొన్ని రకాల వృత్తులలో ఉండేవారిలో కొద్ది మంది క్యాన్సర్‌కు గురైతే మరికొంతమంది ఆరోగ్యంగానే ఉంటారు. ఆస్‌బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ ప్రొడక్షన్ కంపెనీలోని వారు, ఆల్కాహాలిక్ బెవరేజెస్, పొగాకు ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్, చెక్కపొడి, మరియు గామా రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాలో పనిచేసే వారికి ఊపిరితిత్తల క్యాన్సర్ కాని ఇతర హెడ్ మరియు నెక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని చెప్పుకోవచ్చు.
ఆధునిక జీవనశైలిలో అనేక రకాల పరికరాలు, ఉత్పత్తులు, పదార్థాలు నిల్వ ఉండటానికి వాడే పదార్థాలు, మళ్లీ, మళ్లీ వాడే నూనెలు, క్రిమి సంహారకాలు, నైట్ డ్యూటీలు, వాతావరణ కాలుష్యం, వాహనాల నుండి వెలెవడే పొగలు, పొగాకు ఉత్పత్తులు, ఆల్కాహాల్ , అసలు శారీరక శ్రమ లేకపోవటం వలన అధిక బరువు, ఆహారంలో వాడే రంగులు, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు రాత్రిపూట లైట్ల వెలుగు, ఎ.సి. రూముల్లో నిద్రలేకుండా పనిచేసేవారికి మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటం వలన రోగనిరోధక శక్తి తగ్గి క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి