వర్షాకాలం తనతోపాటు జలుబు మరియు ఫ్లూ , ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింప జేసే వైరస్ మరియు బ్యాక్టీరియాలను తనవెంట తెస్తుంది. ఇవి ఇతరులకు సులభంగా సోకే వ్యాధి కారకాలు. ఇన్‌ఫ్లూయంజాగా కూడా పిలువబడుతున్న ఫ్లూ రెస్పిరేటరీటాక్ట్‌కు అత్యంత సులభంగా సోకి వైరల్ ఇన్‌ఫెక్షన్ మరియు సాధారణ జలుబు అని అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ లక్షణాలు మాత్రం జలుబుకు ఉండే తుమ్ములు మరియు ముక్కు దిబ్బడ కంటే మరింత తీవ్రంగా ఉంటాయి. జ్వరం, చలివల్ల వణుకు పుట్టుట, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం, తలత్రిప్పుట, ఆకలి మందగించుట, అలసట దగ్గు, గొంతునొప్పి, ముక్కుల్లో నీరుగారుట, వికారం లేదా వాంతి, చెవినొప్పి లేదా అతిసారం లాంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. దగ్గినపుడు లేదా తుమ్మినపుడు గాలిలోకి వదలబడే వైరస్ సోకిన తుంపర్ల ద్వారా వ్యాపించే ఫ్లూ అత్యంత సులభంగా సోకుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తులు వారు దాని బారినపడిన ఒక రోజు ముందు నుండి వారి లక్షణాలు పూర్తిగా పొయ్యేంతవరకు వ్యాధి కారకులవుతారు.
అయితే ఈ వైరస్‌లను సూర్యరశ్మి, డీప్ ఇన్‌ఫెక్టెంట్లు మరియు డిటర్జంట్ల ద్వారా అరికట్టవచ్చు. సబ్బు ద్వారా ఈ వైరస్‌ను పారత్రోలవచ్చు. కాబట్టి తరచు చేతులు శుభ్రపరచుకోవటం వలన వ్యాధి సోకటం తగ్గించవచ్చు. వాస్తవంగా, నివేదికలు కూడా సూచించునదేమనగా సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవటం అనే ఒక ఆదర్శవంతమైన భావనను అమలుపరచే ఆలోచనలోకి మార్చుకోవటం అనేది ఒక సింగిల్ వ్యాక్సిన్ లేదా మందుల వాడకం వలన కాపాడబడే ప్రాణాల కన్నా మరిన్ని ప్రాణాలను కాపాడే శక్తిని కలిగి ఉన్నది.
తద్వారా ఈ శక్తి సంవత్సరానికి ఒక మిలియన్ కన్నా ఎక్కువ పసి ప్రాణాలను కాపాడానికి దోహదపడుతుంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలలో అత్యధిక కంట్రిబ్యూటర్‌గా అనిశ్ఛతమైన ఘనత ఇప్పటికే ఇండియా కలిగి ఉన్నదని నివేదికలు కూడా తెలుపుతున్నాయి. లెక్కల ప్రకారం ఏ సమయంలోనైనా, ప్రపంచవ్యాప్తంగా 1.4 మిలియన్ల ప్రజలు హాస్పిటల్స్‌లో సంక్రమించిన ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. చేతి శుభ్రత అనేది ఆరోగ్య సంరక్షణ అనుబంధ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించుట మరియు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క అభివృద్ది కొరకు అత్యంత ఆవశ్యకత గల చర్య. అంతేకాకుండా, ఒక మంచి ఆరోగ్య సబ్బుతోను మరియు నీటితోను చేతులు బాగా కడుక్కుంటే పలు అంటువ్యాధులు వ్యాప్తిని అరికట్టవచ్చునని లండన్ స్కూల్ ఆఫ్ హైజీస్ అండ్ టాపికల్ మెడిసన్ వారి పరిశోధన రుజువు చేసింది. రోగం వ్యాపింపజేయానికి సామాన్యంగా చేతులే కదా కారణం - కళ్ళు,ముక్కు లేదా నోటిని కలుషిత వేళ్ళతో ముట్టుకోవటం అంటే సమస్యను మరింత జటిలం చేసుకోవటమే.
అయితే హడావిడిగా చేతుల్ని ముంచి తీసి వేస్తే చాలదు. వాస్తవానికి బ్యూటీసోప్‌తో చేతుల్ని కడుక్కోవటం కూడా అవసరాన్ని తీర్చదు. శుభ్రంగా కనిపించేది ఆరోగ్యకరంగా శుభ్రత కాకపోవచ్చును. కావున బ్యూటీ సోప్‌ను వాడటం మానుకుని, ఏదేని ఆరోగ్య సబ్బుని వాడాలి. దీనివల్ల ఆరోగ్యం మరియు క్రిమి కీటకాల బారినుండి రక్షణ తప్పక అభిస్తాయి.
ఆరోగ్యకరమైన అలవాట్లు వలన క్రిములు దగ్గరకు రావు. ఇంకా ఇల్లు, స్కూలు లేదా ఆఫీసులో వ్యాపించే ప్రమాదం తప్పుతుంది. నోటిని ముక్కుని కవర్ చేసుకోవటం, తరచు చేతుల్ని శుభ్రపరచుకోవటం లాంటి చిన్న చిన్న పనులు క్రిముల్ని తరిమేస్తాయి. తద్వారా సుస్తీ చేయదు. రోగంతో బాధపడే రోజులు తగ్గిపోతాయి. కనీసం ఐదు సందర్భాలలొ చేతుల్ని సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి : భోజనానికి ముందు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్. టాయ్ లెట్ వాడిన తర్వాత మరియు స్నానం చేసే సమయంలోనూ తప్పక వాడాలి. మీ ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయి. ఒక మంచి హెల్త్ సోప్ మరియు మీ శుభ్రమైన చేతులు.
ఫ్లూ వ్యాపించకుండా నిరోధించే మార్గాలు.
1. మంచి ఆరోగ్య సబ్బు, నీటితో మీ చేతుల్ని తరచుగా శుభ్రంగా కడుక్కోండి.
2. జనసమూహాల్లోకి వెళ్ళకండి.
3. వాడేసిన టిష్యులను ఎప్పుడూ ఏరవద్దు.ముట్టుకోవద్దు
4. కప్పులు మరియు తినటానికి వాడే పాత్రల్ని షేర్ చేసుకోకండి.
5. వంట్లో బాగుండనప్పుడు పనిలోకి లేదా స్కూలుకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండండి.
6. మీరు దగ్గినపుడు లేదా తుమ్మినపుడు నోటిని మరియు ముక్కుని టిష్యూతో అడ్డం పెట్టుకోండి.
7. పొడి బారాన్ని నిరోధించానికి ద్రవపదార్థాలను బాగా త్రాగండి.
8. కంటి నిండా నిద్రపొండి.