22
తీవ్ర జ్వరం వచ్చినపుడు కొందరికి మూతి చుట్టూ గుల్లలు వస్తుంటాయి. దీన్ని ‘‘హెర్పిస్ సింప్లెక్స్‘‘ అంటారు. తీవ్రజ్వరం వచ్చినపుడు ఇది బయటపడుతుంది. నోటి చుట్టే కాదు. కాళ్ళకు, చేతులకు ఎక్కడైనా పొక్కులు రావొచ్చు. జ్వరం తగ్గగానే పక్కు కట్టి ఎండి ఊడిపోతాయి. హెర్పిస్ సింప్లెక్స్ అరుదుగా శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించవచ్చు
పిల్లలకు అలర్జీ వల్ల దద్దుర్లు రావటం (అటోపిక్ డెర్మటైటిస్) ఎక్కువ చర్మం బాగా పొడిగా ఉండే వారికి, చెంపలు, చేతులు, కాళ్లు పొడిగా ఉండే ప్రాంతాలలో ఈ దద్దుర్లు ఎక్కువ. వంశ పారంపర్యవంగా ఇంట్లో పెద్దవాళ్ళకు అర్జిక్ రైనటిస్, సైనుసైటిస్, ఆస్థమా, అర్జిక్ కంజెక్టివైటిస్ వంటివి ఉంటే పిల్లలకు ఈ రకం దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువ. దీనికి చర్మం తడిగా ఉండేలా మాయిశ్చరైజర్ క్రీము వంటివి వాడితే తగ్గిపోతుంది. గోళ్ళు కత్తిరించటం, నూలు దుస్తులు వెయ్యటం అవసరం.
టిక్ లనేవి చిన్న చిన్న కీటకాలు. ఇవి కుట్టినచోట నల్లటి మచ్చబడి, పుండుపడుతుంది. జ్వరం మొదవుతుంది. ఇటీవలి కాలంలో ఈ జ్వరాలు (రికెన్షియల్ ఫివర్) పెరుగుతున్నాయి. పర్వత, అటవీ ప్రాంతాలకు వెళ్ళొచ్చిన వారికి ఒంటిమీద దద్దు తగ్గకుండా జ్వరం, కడుపునొప్పి వంటి క్షణాలు కనబడితే విస్మరించటానికి ఏమీ లేదు. ముందు చేతుల మీదా, కాళ్ళమీదా తర్వాత ఛాతీమీదా దద్దు రావచ్చు. ఇది టెట్రాసెక్లిన్ లేదా అజిత్రోమైసిన్ వంటి మందులు ఒక్క కోర్సు ఇస్తే తగ్గిపోతుంది. సమస్యను గుర్తించడం, తక్షణం వైద్యం ఆరంభించటం ముఖ్యం.
ఇటీవల కాలంలో ఎక్కువగా కనబడుతున్న ప్రమాదకరమైన సమస్య ఇది. గతంలో దీన్ని ‘‘మ్యుకో క్యుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్’’ అనేవారు. జ్వరంతో పాటు చర్మం మీద, నోటిలోని జిగురు పొర మీద దద్దు కనబడితో, లింఫ్ గ్రంథులు వాచి ఉంటే ‘‘కవాసాకి’’ గా అనుమానించేవారు. కానీ ఇప్పుడిది రకరకాల రూపాల్లో బయటపడుతుంది. చిన్న పిల్లలకు తీవ్రమైన జ్వరం, దద్దుతో పాటు కళ్ళు బాగా ఎర్రబడితే, కవాసాకిగా అనుమానించాలి. కళ్ళు బాగా ఎర్రబడతాయి కానీ పుసులు కట్టవు. రెప్పులు అతుక్కోవు. నాలుక ఎర్రగా, స్టాబెర్రీ పండులాగా ఉంటుంది. దద్దులు ఎక్కువగా అరిచేతులు, అరిపాదాల్లో వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంథులు వాచి, బిళ్ల కట్టినట్టు ఉంటాయి. తీవ్రమైన జ్వరం, అదీ మామూలు జ్వరం మందులు, యాంటీ బయోటిక్స్‌తో తగ్గకపోవటం, అరిచేతులలో, అరిపాదాల్లో ర్యాష్, మొడదగ్గర బిళ్ళలు మొదలగుల క్షణాలు కనపడినపుడు వెంటనే వైద్యుల సలహాతో పరీక్షలు చేయుంచుకోవాలి. వీరిలో రక్తంలో ప్లేట్‌లెట్లు చాలా ఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చు.
ఈ ఎస్ ఆర్, సి ఆర్ పీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి కవాసాకిలో గుండె ప్రభావితమై, మున్ముందు తీవ్రమైన గుండెపోటు వచ్చే ప్రమాదమూ పొంచి ఉంటుంది. ముఖ్యంగా గుండెలోని కరోనరీ రక్తనాళాలు వాచి, బెలూన్ల మాదిరిగా ఉబ్చి (అనూరిజమ్స్), వాటిలో రక్తం గడ్డకట్టి, రక్తప్రసారం ఆగి, గుండెపోటు వంటివి ముంచుకురావచ్చు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యం చేయ్యకూడదు. జ్వరం వచ్చిన వారం పదిరోజులలో ‘‘ఇమ్యూనోగ్లోబ్యులిన్టు’’ ఇస్తే భవిష్యత్తులో గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది ఖర్చుతో కూడినదైనా నివారించదగ్గ సమస్య. ఇమ్యూనోగ్లోబ్యున్లు ఇవ్వలేని స్థితిలో కనీసం ‘‘మిథైల్ ప్రెడ్నిసలోన’’ వంటివైనా రక్తనాళాల్లో ఇవ్వాల్సి ఉంటుంది.
ముక్కులో వేళ్లు పెట్టుకునే పిల్లలకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. ఇలా స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా వలన వచ్చే సమస్య ఇంపెటిగో. ఈ బ్యాక్టీరియా ముక్కులో ఉంటూ మనతోపాటే సహజీవనం చేస్తుంటుంది. ముక్కులో వేళ్లు పెట్టి కెలికితే ఆ వేళ్లకు బ్యాక్టీరియా అంటుకొని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీంతో అక్కడ ముందు చిన్న నీటి బుడగ మాదిరిగా ఏర్పడుతుంది. తర్వాత చిట్లి, తేనె రంగులో పక్కు కడుతుంది. ఈ రసి ఎక్కడ అంటితే అక్కడ బుడగ పుట్టుకొస్తుంది. కొన్నిసార్లు ఇవి ఒళ్లంతా వ్యాపించడమే కాకుండా ఇతరులకు పాకుతుందికూడా. అందుకే దీని ఇంపెటిగో కంటాజియోసా అని అంటారు. దీన్ని తేలికగానే గుర్తించవచ్చు. దీనికి మాత్రలు అవసరం ఉండదు. పైపూత మందు రాస్తే చాలు. వేడినీటిలో ఉప్పువేసి కాపడం పెట్టటం, పైపూత మందు రాస్తే చాలు. 2,3, రోజులో తేలికగా తగ్గుతుంది కూడా. చాలామంది ఇవి అంటుపుండ్లు అని తెలియ కంచుకగా భావించి మంత్రాలు, జాజు మట్టి పూస్తుంటారు. దీంతో అవి తగ్గకపోగా మరింత పెరుగుతాయి.