డా. జి.వి. నరేంద్ర, రెటినా స్పెషలిస్ట్, అరవిందా కంటి ఆసుపత్రి, విజయవాడ
రక్తంలో ఇన్సులిన్ పరిమాణము తగ్గుట వలన చక్కెర పరిమాణము బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగును దీనినే చక్కెర వ్యాధి అంటారు. చక్కెర వ్యాధివలన శరీరములో రక్తనాళములతో పాటు కంటిలోని రక్తనాళాలలో మార్పులు వస్తాయి. చక్కెరవ్యాధి అదుపునకు ఇన్సులిన్ లేదా మాత్రలు తీసుకునే రెండు వర్గములలోనూ ఈ మార్పులు సంభవిస్తాయి. సకాలములో కంటి వైద్యము చేయించుకొనని యెడల శాశ్వతముగా కంటి చూపు మందగించవచ్చును.
డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి
చక్కెరవ్యాధివలన కంటి లోని రక్తనాళములో వచ్చు మార్పుల వలన రెటీనా కణజాలమునకు సరిపడినంత ఆక్సిజన్ అందకపోవటం వలన రెటీనా దెబ్బతింటుంది. దీనివలన రెటీనా వాపు, కొన్ని సందర్భాలలో రక్తనాళములు చిట్లి, రక్తము గూడుకట్టుట, చివరి దశలలో రెటీనా వీడిపోవుట జరుగును.
వ్యాధి కారణాలు :
1.దీర్ఘ కాలంగా చక్కెరవ్యాధితో బాధపడుతున్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశము ఎక్కువ.
2. అధిక రక్తపోటు (బిపి) ఏనీమియా, మూత్రపిండవ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువగా తీవ్రత చూపుతుంది.
3.మధుమేహ నియంత్రణ సరిగాలేని వారిలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
వ్యాధి లక్షణములు :
1.వ్యాధి ప్రారంభథలో ఎటువిం రోగలక్షణములు కనిపించవు, కంటి నొప్పి, చూపు తగ్గటం వంటి లక్షణాలు ఉండవు.
2.వ్యాధి ముదిరిన కొద్ది నరములు ఉబ్బటం మరియు విడిపోవటం వల్ల చూపు మందగించవచ్చును.
వ్యాధినిర్థారణ :
చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారు కంటి వైద్యులను సంప్రదించి కంటి నరములను తనఖీ చేయించుకోవలెను. అవరసమైన యెడల ఎఫ్.ఎఫ్,ఏ. (ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫి) పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించబడుతుంది. కొందమందిలో ఓ.సి.టి అనే ప్రత్యేక పరికరం ద్వారా పరీక్ష చేయవచ్చును. దీని ద్వారా రెటీనా వాపును నిర్థారిస్తారు. రక్తపరీక్ష చేయించుకొని చక్కెరస్థాయిని నిర్థారించుకోవాలి.
వ్యాధి నివారణ :
1. రక్తములో చక్కెర పరిమాణమును అదుపులో ఉంచుకోవలెను
2. బి.పి (రక్తపోటును) మూత్రపిండ వ్యాధులను అదుపులోఉంచుకొనవలెను.
3. లేజర్ ట్రీట్ మెంట్ తో రక్తనాళముల వాపును తగ్గించెదరు.
4. వ్యాధి తీత్రంగా ఉన్న కొంతమందిలో విట్రో రెటినల్ ఆపరేషన్ ద్వారా గూడుకట్టిన రక్తమును తీసివేస్తారు.
5. కంటిలో ఇంజెక్షన్ ద్వారా కూడా వాపు, రక్తమును కొంతవరకు నయం చేయవచ్చును.
జాగ్రత్తలు :
చక్కెర వ్యాధి ఉన్నవారు కంటి పరీక్షలు ప్రతీ సంవత్సరం తప్పనిసరిగా చేయించుకొవాలి.
చక్కెరవ్యాధిని పూర్తి అదుపులో ఉంచుకోవాలి.
చక్కెర వ్యాధి నివారణ లేదా నియంత్రణమే ఉత్తమమైన మార్గము.