header

Oats Matka

ఓట్స్ మట్కా
కావలసినవి :
రోల్డ్ ఓట్స్ : అరకప్పు
అలసందలు : గుప్పెడు : వీటిని ముందురోజు రాత్రంతా నానబెట్టకోవాలి
ఉల్లిపాయ : ఒకటి సన్నగా తరుగుకోవాలి
పచ్చిమిర్చి : ఒకటి
కరివేపాకు : కొద్దిగా
నూనె : 2 టీస్పూన్లు
కొబ్బరితురుము : టీస్పూన్
క్యారెట్ తురుము : 2 టీస్పూన్లు
కొత్తిమీర తురుము : కొద్దిగా
ఆవాలు : చిటికెడు
జీలకర్ర : అర టీ స్పూను
నిమ్మరసం : టేబుల్ స్పూను

తయారుచేయి విధానం :
కుక్కర్లో శుబ్రం చేసి నానబెట్టిన అలసందలు వేసి కొద్దిగా నీరుపోసి ఉప్పు సరిపడా వేసి రెండు విజిల్స్ వచ్చిన తరువాత దించుకోవాలి. ఓట్స్ శుభ్రంగా కడిగి ఆవిరిమీద ఇడ్లీల లాగా ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
తరువాత ఓట్స్ లో కొద్దిగా ఉప్పు చల్లి టీస్పూన్ నూనె వేసి కలపాలి. ఇలా చేయటం వలన ఓట్స్ ముద్దగా మారదు ఇప్పుడు పాన్లో మిగిలిన నూనె వేసి ఆవాలు , జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు,అల్లం తురుము అన్నీ వేసి వేగనివ్వాలి. తరువాత ఉడికిన అలసందలు వేసి కలపాలి. కొద్దిగా నీరు కలిపి నీరు ఆవిరి అయ్యేదాకా ఉడికించాలి. తరువాత ఉడికించిన ఓట్స్,పసుపు వేసి ఓ నిముషం వేయించి దించాలి. ఇప్పుడు క్యారెట్, కొబ్బరి, కొత్తిమీర తురుములతో బాటు నిమ్మరసం కూడా వేసి కలపాలి.