header

Fatiliver….. ఫ్యాటీలివర్‌

Fatiliver….. ఫ్యాటీలివర్‌

Doctor M.N. Pavankumar, Surgical Gastro Entrologist, Yesoda Hospital, Somajiguda, Hyderabad.Phone :9701971717
మానవ శరీరంలో అతి కీలకమైన అవయవం కాలేయం. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్‌ సమస్య మొదవుతుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్‌ సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉన్న ఈ సమస్యను ఆధునిక చికిత్సతో సులభంగా తగ్గించవచ్చని అంటున్నారు సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాజిస్ట్‌ డా॥ ఎమ్‌.ఎన్‌. పవన్‌ కుమార్‌.
పైపొట్టలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని తెలిసిన మాత్రలేవో వేసుకుని ఉండిపోతారు. చివరకు నొప్పి ఎక్కువయ్యాక ఆసుపత్రికి వెళితే ఆల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో ఫ్యాటీలివర్‌ అని తేుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య లివర్‌ సిర్రోసిస్‌కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
కారణాలు : ఫ్యాటీ లివర్‌ చేజేతులా కొని తెచ్చుకుంటున్నదే. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్‌ సమస్య కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, చిప్స్‌, బర్గర్స్‌ వంటి జంక్‌ఫుడ్స్‌ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోవకపోవటం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పు కాలేయ వాపుకు కారణమవుతున్నాయి.
ఎం జరుగుతుంది ? శరీరంలో కొవ్వును వివిధ భాగాలకు అందజేసే ప్రక్రియను నిర్వర్తించడంలో లివర్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలోకి వచ్చిన ఫ్యాట్‌ అంతా కాలేయంలో నుంచి వచ్చిన ఎంజైమ్స్‌తోనే డైజెస్ట్‌ అవుతుంది. శరీరానికి గుండెవంటి కొన్ని అవయవాలకు కొంత ఫ్యాటీ యాసిడ్స్‌ అవసరమవుతాయి. కానీ అధిక మొత్తంలో కొవ్వు వచ్చి చేరిపుడు అది శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా కాలేయ కణాలు ఉబ్బి ఫ్యాటీలివర్‌ సమస్య మొదవుతుంది.ఇది మొదటి దశ ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉబ్బిన కణాలు పగిలిపోతాయి. దీంతో ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఇది రెండవ దశ. ఆల్కాహాల్‌ ఎక్కువ మోతాదులో తీసుకోవటం వలన ఈ సమస్య వచ్చినట్లయితే ఆల్కాహాల్‌ హెపటైటిస్‌ అంటారు. ఆహారపు అలవాట్ల వలన వచ్చినట్లయితే నాన్‌ ఆల్కాహాల్‌ హెపటైటిస్‌ అంటారు. వైరస్‌ వలన వచ్చినట్లయితే వైరల్‌ హెపటైటిస్‌ అంటారు. ఈ దశలో కూడా చికిత్స తీసుకోకపోతే లివర్‌ పూర్తిగా సింక్‌ అవుతుంది. దీన్ని లివర్‌ సిర్రోసిస్‌ అంటారు. ఇది మూడోదశ.
లక్షణాలు : పొట్టలో బరువుగా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్ట పైభాగంలో నొప్పిగా ఉంటుంది. కొందరిలో ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో ఫ్యాటీలివర్‌ ఉన్నట్లుగా తెలుస్తుంది.లక్షణాలు మాత్రం కనిపించవు. రెండవ దశలో కామెర్లు కనిపిస్తాయి. రక్తస్రావం మొదవుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. లివర్‌ ఫంక్షన్‌ తగ్గిపోతుంది. పొట్టలో, కాళ్లలో నీరు పేరుకుపోతుంది. మూడవ దశలో కూడా ఇవే లక్షణాలు కనిపించడంతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినడం మొదవుతుంది.
చికిత్స : సమస్య ఎందువల్ల వచ్చింది కనుక్కోవాలి.కారణాన్ని తెలుసుకుని అందుకు తగిన చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మందుగా ఆల్ట్రాసౌండ్‌ అబ్డామిన్‌ స్కానింగ్‌ను ఫాస్టింగ్‌లో చేయించాలి.కాలేయం పనితీరును తెలుసుకోవటానికి లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్‌ సమస్యను మందులతో పూర్తిగా తగ్గించచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవటం, బరువును తగ్గించుకోవటంతో పాటు మందులు వాడాల్సి ఉంటుంది. రెంండవ దశలో ఆసుప్రతిక్రి వెళ్ళినా మందుతో బాగుచేయవచ్చు 70 శాతం లివర్‌ పాడయినా మిగతా బాగున్న 30 శాతం లివర్‌ దెబ్బ తినకుండా చికిత్స చేయటం జరుగుతుంది. అంతేకాకుండా మూడవ దశలోకి అంటే లివర్‌ సిర్రోసిస్‌కు దారితీయకుండా కాపాడటం జరుగుతుంది. మూడవ దశ అంటే లివర్‌ సిర్రోసిస్‌లో కాలేయం సింక్‌ అయిపోయి ఉంటుంది.
పాడయిన లివర్‌ను బాగుచేయడం కుదరదు. అయితే 10 శాతం బాగున్నా శరీరానికి సరిపోతుంది. ఈ దశలో చకిత్స ఏమిటంటే ఆ పది శాతం దెబ్బతినకుండా కాపాడటమే. దీంతో పాటు కాలేయం మీద ఒత్తిడి పడకుండా చూడటం. ఇతర కాంప్లికేషన్స్‌ రాకుండా మందులు ఇవ్వడం జరుగుతుంది. లివర్‌కు సపోర్టుగా మెడిసిన్స్‌ ఇవ్వడం. శరీరంలో టాక్సిన్స్‌ పేరుకుపోకుండా మందులు ఇవ్వడం. పేగులలో బాక్టీరియా తగ్గటానికి యాంటీ బయాటిక్‌ మందులు ఇవ్వడం వంటివి చేస్తారు. మొదటి దశ రెండవ దశలో వచ్చి వారికి చికిత్స ఇస్తారు. మూడవ దశలో చికిత్స ద్వారా పాడయిన కాలేయాన్ని బాగుచేయలేం.
గాల్‌ స్టోన్స్‌ : గాల్‌ స్టోన్స్‌ ఏర్పడటానికి కొలస్ట్రాల్‌ కారణమవుతుంది. గాల్‌బ్లాడర్‌ కాలేయం క్రింద ఉంటుంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువయినపుడు కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది.అప్పుడు కాలేయం దాన్ని బయటకు పంపించి వేస్తుంది. ఇది గాల్‌బ్లాడర్‌లోకి వెళుతుంది.లివర్‌ నుంచి ఉత్పత్తి అయ్యే బైల్‌లో కొలస్ట్రాల్‌ కరిగిపోతుంది. ఇది గాల్‌బ్లాడర్‌లోకి వెళ్ళి చివరకు గట్టిపడి స్టోన్స్‌గా మారిపోతుంది. జీర్ణక్రియ జరుగుతున్నపుడు బైల్‌ అంతా జీర్ణక్రియ కోసం వెళుతుంది. ఫాస్టింగ్‌ ఉన్నపుడు బైల్‌ అంతా ఎక్యుములేట్‌ అయిపోతుంది.అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం మానేస్తే గాల్‌స్టోన్స్‌ ఫామ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ.
చికిత్స : గాల్‌బ్లాడర్‌లో ఏర్పడే స్టోన్స్‌ మెడిసిన్‌తో కరగవు. ఇవి కొలస్ట్రాల్‌ మూంగా ఏర్పడినవి.ఆపరేషన్‌ చేసి తొలగించడం ఒక్కటే పరిష్కారం అయితే రాళ్లు ఉన్నంత మాత్రాన అందరికీ సర్జరీ అవసరం లేదు. నొప్పి ఉన్నప్పుడు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నపుడు అంటే షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో లేనపుడు ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. మళ్లీ రాళ్లు ఏర్పడకుండా ఉండటం కోసం గాల్‌బ్లాడర్‌ను తొలగించడం జరుగుతుంది. ప్రస్తుతం లాప్రోస్కోపిక్‌ సర్జరీ ద్వారా గాల్‌బ్లాడక్‌ స్టోన్స్‌ తొలగించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సిల్స్‌ (సింగిల్‌ ఇన్‌సిసన్‌ లాప్రోస్కోపిక్‌ సర్జరీ) అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో బొడ్డు దగ్గర ఒకే రంధ్రం చేసి గాల్‌ బ్లాడర్‌ తొలగించడం జరుగుతుంది. ఈ సర్జరీ వలన రోగి త్వరగా కోలుకుంటాడు.