అరవింద్ ఐ కేర్ సిస్టమ్ - ఉచిత నేత్రవైద్యం ఇది స్వచ్ఛంద సేవా సంస్థ.... లాభార్జనే ధ్యేయంగా ఎప్పుడూ పనిచేయదు. సేవ ఉంది వ్యాపారము కూడా జరుగుతుంది. సేవ కోసమే వ్యాపారం. వ్యాపారం కోసం సేవ కాదు.
వైద్యవిధానం : అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, ఆధునాతన సౌకర్యాలు సంపన్నులను ఆకర్షిస్తాయి.సంతోషంగా ఫీజు చెల్లించి వైద్యం చేయించుకుంటారు. నామ మాత్రపు ఫీజు ఉచిత సేవలను పేదలను ఆకట్టుకుంటాయి.సంపన్నులు చెల్లించిన డబ్బును పొదుపుగా సమర్థవంతంగా ఖర్చు పెట్టడం ద్వారా మరో నలుగురు పేదలకు వైద్యం అందిస్తారు. ఇక్కడ మూడు రకాల సేవలుంటాయి.
ఒకటవ పద్దతి పూర్తిగా ఉచితం
రెండవ పద్దతి తగ్గింపు ధర
మూడవ పద్దతి చెల్లింపు.
ఉచిత సేవలు పొందాలనుకుంటే ఎలాంటి దృవపత్రాలు చూపించవసిన పనిలేదు. ఉచితమైనా, చెల్లింపు అయినా అందరికీ ఒకటే వైద్యం. ఒకసారి ఆసుపత్రిలో కాలు పెట్టాక ఎటువంటి తేడాలుండవు. పొదుపు సూత్రం, మానవ వనరుల సమర్థ నిర్వహణ కంటిలో అమర్చే లెన్స్ సొంత తయారీ అరవింద్ విజయ రహస్యం. డాక్టర్ పి. నాంపెరుమాళ్ళ స్వామి ఈ సంస్థకు ఛైర్మన్.
చెన్తైలోని మథురైలో ప్రథాన ఆసుపత్రితో పాటు కోయంబత్తూరు, పాండిచ్చేరి, తిరునెల్వేలి, దిండిగల్, తిరువూరులో శాఖలు ఉన్నాయి.
వీక్షకులకు విజ్ఞప్తి : ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, బంధువులకు వీలైనంత మందికి తెలియచేయ గలరు. తద్వారా అవసరమైనపుడు ఎక్కువ మంది పేదలు సహాయం పొందుతారు.