header

Daiabetamix India ….. డయా బెటామిక్స్‌ ఇండియా...

Daiabetamix India ….. డయా బెటామిక్స్‌ ఇండియా...
నిరుపేద మధుమేహ చిన్నపిలల్లకు చేయూత.
పిల్లలకు వచ్చే టైప్‌ 1 మధుమేహం. ఇది కొందరికి పుట్టుకతోనే వస్తే మరికొందరికి మధ్యలో వస్తుంది. ఆ తరవాత జీవితాంతం వదలదు. మరి దాని చికిత్సకు అవసరమయ్యే డబ్బులను నిరుపేదలు ఎక్కడనుంచి తేగలరు? ఇలాంటి వాళ్లకు సాయం చేయటానికి డయాబెటామిక్స్‌ ఇండియా సాయం చేస్తుంది. మన రాష్ట్రంలో దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని పంజాగుట్టాలో ఉంది. ఫోన్‌ నెంబర్లు : 9912119527, 9848039111.
నిరుపేదలకు ఉచితం : నిరుపేద కుటుంబాలలో పుట్టి, మధుమేహం వచ్చిన 18 ఏళ్ళ లోపలి పిల్లలకు ఉచితంగా పరీక్షలు చేసి మందు ఇస్తాం అంటున్నారు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న డాక్టర్‌ పి.ఇంద్రసేన్‌ రెడ్డి. ఇక్కడకు వచ్చే తల్లి దండ్రులు తమ పిల్ల యెక్క వయస్సును తెలిపే పత్రాలు ఆదాయ ధ్రువపత్రాలు జిరాక్స్‌ కాపీలు, మధుమేహం ఉన్న బాబు/పాపవి రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలు తీసుకు రావాలి. పిల్లలను అంతకు ముందు ఎవరైనా డాక్టరు దగ్గరుకు తీసుకెళ్తే ఆ రిపోర్టు తేవాలి. అలా వచ్చిన పిల్లలకు అవసరమైతే రక్తపరీక్షలు, కంటి పరీక్షలు మూత్ర పరీక్షలు ఉచితంగానే చేస్తారు. ఆ తరువాత ఓ బ్యాగ్‌ ఇస్తారు. షుగర్‌ ఎంతెందో చేప్పే గ్లూకోమీటర్‌, ఇన్సులిన్‌, ల్యాన్‌సెట్స్‌, సిరంజీలు ఈ బ్యాగులో ఉంటాయి.
కొందరు చిన్నారులకు బాగా నీరసంగా ఉన్నపుడు వెంటనే కీటోన్స్‌ (షుగర్‌ 500 కన్నా ఎక్కువ వచ్చినపుడు కీటోన్‌ తయారవుతాయి అంటే ప్రమాదమని అర్థం) ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవటానికి కీటో స్టిక్స్‌ ఇస్తారు. దీన్ని మూత్రంలో ముంచితే కీటోన్స్‌ వెంటనే చేప్పేస్తుంది. దాన్ని బట్టి డాక్టర్‌ దగ్గరుకు వెళ్ళాలా వద్దా అన్నది తెలిసిపోతుంది.
డయాబెటామిక్స్‌ చేసే ఈ కార్యక్రమంలో మూడు అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములు. మొదటిది. నోవానార్టిస్‌. ఇది ప్రపంచంలో ఇన్సులిన్‌ అత్యధికంగా తయారు చేసే కంపెనీ. రెండోది రోష్‌ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే టెస్టింగ్‌ మెషిన్లు, స్ట్రిప్స్‌ తయారు చేస్తుంది. మూడోది ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ పీడియాట్రిక్‌ అండ్‌ అడాసెంట్‌ డయాబెటిస్‌. మధుమేహం వచ్చిన చిన్నారులను ఎలా పరీక్షించాలో. ఏయే మందులు ఎప్పుడు ఇవ్వాలి.. ఇలాంటి అనేక విషయాల్లో డయాబెటామిక్స్‌ ఇండియా సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. ఈ సంస్ధ.