header

Free Heart Operations for children – Hrudaya Foundation..

Free Heart Operations for children – Hrudaya Foundation..
చిన్నారులకు ఉచితంగా...గుండె ఆపరేషన్లు....హృదయ ఫౌండేషన్‌...
హృదయ... ఇప్పటివరకూ రెండువేల మంది చిన్నారుల గుండె సమస్యలను పరిష్కరించింది. వీరంతా పేద, మధ్యతరగతికి చెందిన పిల్లలే. మనదేశంలో ఏటా రెండు లక్షల మందికి ఈ సమస్య ఎదురవుతుంటే ఏనభై శాతం మందిలో ఈ సమస్యను గుర్తించటంలో ఆలస్యం అవుతుంది అంటారు సంస్థ నిర్వాహకులు...డాక్టర్‌ గోపీచంద్‌. తను డాక్టర్‌ కావటంతో, తన అక్క గుండె వాల్వ్‌ సమస్యతో చనిపోవటంతో అమెరికాలో చిన్నపిల్లల గుండె రోగాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఈ సంస్థ స్థాపించారు. కొంతకాలం అపోలో, మెడ్విన్‌, కేర్‌ ఆస్పత్రులో పనిచేసారు. ఆ సమయంలో ఈ అసుపత్రుల యజమాన్యాన్ని నెలకు పదిహేను ఆపరేషన్ లు ఉచితంగా చేసేందుకు ఒప్పించారు.
పిల్లల వైద్యం కోసం పదివేల రూపాయలు కూడా ఖర్చుపెట్టలేని ఎందరో ఉన్నారు. వారందరికీ ఏదో విధంగా సాయపడాలన్న సంక్పలంతో హృదయ ఫౌండేషన్‌ ఏర్పరచారు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లల వరకు ఈ సంస్థ వైద్యసాయం అందిస్తుంది. సంస్థ తరపున జరిగే శస్త్ర చికిత్సలన్నిటినీ హైదరాబాద్‌లోని స్టార్‌ హాస్పటల్‌లో ఉచితంగా చేస్తారు.
అలా 2014వరకూ రెండువేల మంది చిన్నారులు ఆపరేషన్‌ చేయించుకున్నారు. దీనికి అనుబంధంగా వీరి మిత్రులు డా.నాగార్జున, ప్రేమ్‌రెడ్డి, జయదేవ్‌ ఆధ్వర్యంలో అమెరికాలోనూ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తారు సీనీ నటుల సాయంతో విరాళాలు సేకరిస్తారు. గుండెజబ్బులతో బాధపడుచున్న చిన్నపిల్లల కోసం సహృదయంతో, విరాళాలు ఇవ్వవచ్చు.
H.No.8-2-608/28, Ground Floor,
Ashiana Building, Gaffar Khan Colony,
Road No.10, Banjara Hills, Hyderabad – 500034
Telangana, India
Phone: 040 23314412
E-mail: hrudaya.foundation@gmail.com