యోగానంద నేత్రాలయం - కడియం, పశ్ఛిమ గోదావరి జిల్లా
గుంటూరు జిల్లా రేవేంద్రపాడు వాస్తవ్యులైన శ్రీ ప్రభాకరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా కడియంలో 40 పడకల పరమహంస యోగానంద నేత్రాలయ ప్రారంభానికి కృషిచేశారు. ఇది యల్‌వి ప్రసాద్ నేత్ర సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. ఈ నేత్రాలయం ఓపి కి వచ్చేవారి నుండి రూ.50- నామమాత్ర ఫీజు తీసుకుంటారు.
తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు మరియు పేదలకు కంటి వైద్యం ఉచితం.పేదలు తప్ప మిగతా వారు మందులకు కళ్ళజోళ్లకు కొంత చెల్లించవసిందే. పేదలకు కళ్ళజోళ్ళు, శస్త్రచికిత్సలు ఉచితం.
రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమైన రోగులను గుర్తించి సొంత వాహనాలలో పరమహంస యోగానంద నేత్రాలయానికి తీసుకొచ్చి అక్కడే ఉచితంగా శస్త్రచికిత్స చేస్తారు. క్లిష్టమైన కేసులు వస్తే రాజమండ్రిలోని వీరి సొంత ఆసుపత్రి అకీరాకు లేదా విజయవాడ, విశాఖపట్నంలోని యల్ వి ప్రసాద్ ఆసుపత్రులకు తీసుకువెళ్ళి చికిత్స అందిస్తారు.
డాక్టర్ ప్రభాకరరావుగారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కుమార్తె హరిప్రియ 2011నుండి ఆస్పత్రి డైరెక్టర్,సర్జన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఆమె వేతనం తీసుకోకుండా చేస్తున్నారు. ఆమె భర్త ఇంద్రజిత్ లేసిక్ స్పెషలిస్ట్. ఆఫ్తామాలజీలో బంగారు పతకం సాధించారు. వీరిద్దరు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.