header

Best Food for Heart...

Best Food for Heart...
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారం
ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవటం వలన గుండె జబ్బుల అవకాశాలు తగ్గుతాయి.
టమాటోలు : వీటిలో లైకోపిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. టమాటోలు ముక్కలుగా కాని, సూప్‌, సలాడ్‌ రూపంలోగాని తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్‌, లైకోపిన్‌ మూలంగానే టమోటోలు ఎర్రగా ఉంటాయి.
రక్త ప్రసరణ నియంత్రించటానికి ఉపయోగపడే విటమిన్‌ సి, ఇ. ఫ్లేవనాయిడ్స్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.
దానిమ్మ : ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే కొస్టరాల్‌ మూలకంగా జరిగేది నెమ్మదిగా జరుగుతుంది. గుండెజబ్బు రిస్క్‌ తగ్గుతుంది. రక్తంలో ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికమవుతాయి.
గుమ్మడికాయ : గుమ్మడి కాయలో బీటా కెరటోన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చేరిన తరువాత విటమిన్‌ - ఎ గా మార్పు చెందుతుంది. గుండె జబ్బుకు, క్యాన్సర్‌కు, త్వరగా వయస్సు పెరిగి పోయినట్లు కనిపించడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ ధాతువులను హరించకుండా బీటా కెరటోన్‌ నిరోధిస్తుంది. ప్రతి రోజూ అవసరమయ్యే బీటా కెరటోన్‌, గుండెను రక్షించే ఆరోగ్యకర పొటాషియంలో పావువంతు అరకప్పు గుమ్మడికాయ ముక్కలలో లభిస్తుంది.
చేపలు : రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా, వాపు రాకుండా నిరోధించి, గుండెను రక్షించే ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్‌ చేపలలో దండిగా ఉంటుంది. ఇవి కొలస్ట్రాల్‌ లెవల్స్‌ను కూడా తగినంతగా ఉంచుతాయి. సార్టిన్‌ చేపలలో మాత్రమే దండిగా ఒమేగా-3 ఉంటుంది. సన్నని ఎముకలు తీసివేసి చేపలను తీసుకున్నట్లయితే వాటిలో ఖనిజాలు దండిగా లభిస్తాయి.
బెర్రీస్‌ : బెర్రీస్‌ గుండె ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారం. ఇవి తినటం వలస రక్తపోటు తగ్గుతుంది. మంచి కొలస్ట్రాల్‌ పెరుగుతుంది. అందువలన స్ట్రాబెర్రీస్‌, బ్లూబెర్రీస్‌, బ్లాక్‌ బెర్రీస్‌, రాన్స్‌ బెర్రీస్‌ తినవచ్చు. తాజా లేదా నిల్వ చేసుకున్న బెర్రీస్‌లో బలమైన పాలిఫినాల్స్‌, రోగాలపైన పోరాడే యాంటీ యాక్సిడెంట్స్‌ ఉంటాయి.
రెడ్‌వైన్‌, ద్రాక్ష, చాక్‌లెట్‌ గింజలో కూడా ఈ పాలీఫినల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి.