డా. సురేష్‌చంద్ర హరి, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్, ఒబేసిటి సర్జరీ స్పెషలిస్ట్, బీమ్స్ హాస్పటల్, హైదరాబాద్. ఫోన్ : 040-39417700, 9866141070
పొట్టలో ఉండే భాగాలు బయటకు చొచ్చుకు వస్తే ఆ వ్యక్తి పడే బాధ అంతా ఇంతా కాదు. హెర్నియా ఉన్నవాళ్ళు నలుగురిలో తిరగలేక, సాధారణ జీవితం గడప లేక ఎంతో ఆందోళనకు గురవుతుంటారు. కొందరు సమస్యను అలాగే నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు హెర్నియాకు మంచి చికిత్స అందుబాటులో ఉందటున్నారు డా. సురేష్‌చంద్ర హరి.
పొట్టభాగంలో కండరభాగం బలహీనపడి పేగులు లేదా ఇతర భాగాలు బయటకు చొచ్చుకు రావడాన్ని హెర్నియా అంటారు. హెర్నియాను నిర్లక్ష్యంచేస్తే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. బలహీనపడిన కండరభాగం నుంచి బయటకు వచ్చిన పేగులు, ఇతర భాగాలు ఏకారణాల వల్లనైనా పగిలినట్లయితే ఇనఫెక్షన్‌కు దారితీయవచ్చు. ఇన్‌ఫెక్షన్ పెరిగిపోతే ప్రాణాలు పొయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియాను గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవాలి.
ఎన్నో రకాలు : హెర్నియాలో ఇన్‌సిషనల్ హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా, ఫిమెరల్ హెర్నియా, హయటల్ హెర్నియా అని పలురకాలున్నాయి. సాధారణంగా ఎక్కువ మందిలో ఇంగ్వైనల్ హెర్నియా కనిపిస్తుంది. ఇది గజ్జల భాగంలో వస్తుంది. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి డైరెక్ట్ హెర్నియా, మరోకటి ఇన్‌డైరెక్ట్ హెర్నియా. పురుషుల్లో ఇంగ్వైనల్ హెర్నియా, స్త్రీలలో ఫిమరల్ హెర్నియా సాధారణంగా వస్తుంటుంది. కొన్ని రకాల హెర్నియాల వల్ల సాధారణ జీవితంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. తుమ్మినపుడు, దగ్గినపుడు, బరువులు మోసేటపుడు నిలుచున్నప్పుడు పొట్ట భాగంలో ఒక కణితి మాదిరిగా, కొత ఉబ్బుగా పైకి చొచ్చుకొని వచ్చినట్లుగా ఉండటం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినవి మళ్ళీ లోపలికి పోవచ్చు లేదా శాశ్వతంగా బయటకే ఉండిపోవచ్చు. ఇటువంటి హెర్నియాలు మందులతో తగ్గవు. హయటల్ హెర్నియా ఉన్నవారు భోజనం చేసినా వాంతులు కావడం. కొద్దిగా తినగానే పొట్ట నిండిపోయిన ఫీలింగ్ కలగడం జరుగుతుంది. దానివల్ల మనిషి శారీరకంగా బలహీపడిపోతారు.
అంబిలికల్ హెర్నియాలో బొడ్డు దగ్గర మందుకు చొచ్చుకొచ్చినట్లవుతుంది. దీనివల్ల శారీరకంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. గతంలో ఏదైనా శస్త్రచికిత్స జరిగినపుడు కుట్లు వేసిన ప్రాంతంలో చర్మానికి ఆనుకుని ఉన్న కండరాలు బలహీన పడినట్లయితే ఆ ప్రాంతంలో లోపలి నుంచి పేగులు బయటకు చొచ్చుకు వస్తాయి. దీన్ని ఇన్‌సిషనల్ హెర్నియా అంటారు. ఈ విధంగా బయటకు వచ్చిన భాగంలో ఏదైనా దెబ్బ తగిలితే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే హెర్నియాను గుర్తించిన వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలి.
నిర్థారణ: ఎండోస్కోపి, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్‌రే, సి.టీ స్కాన్‌లు ద్వారా హెర్నియాను గుర్తించవచ్చు. కాని కొన్ని సందర్భాల్లో ప్రత్యేక క్లినికల్ ఎగ్జామినేషన్స్ ద్వారా మాత్రమే గుర్తించే వీలుంది. సాధారణంగా హెర్నియాను గుర్తించేందుకు 90 శాతం పరీక్షలు అవసరంలేదు. హెర్నియాను గుర్తించిన తరువాత ఆ ప్రదేశంలో ఏమి ఉన్నాయో నిర్థారించుకొనేందుకు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
చికిత్స: గతంలో హెర్నియాకు ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది.కాని, ప్రస్తుతం లాప్రోస్కోపిక్ పద్ధతిలో రెండు, మూడు గాట్లు పెట్టి ఆపరేషన్ చేసే వీలుంది. కొన్ని ప్రత్యేక పరికరాలను లోపలికి పంపి బయటకు వచ్చిన పేగులు, ఇతర భాగాలను యధాస్థానంలో అమర్చి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. ఓపెన్ సర్జరీ చేసినట్లయితే మెష్ వేసినప్పటికీ శస్త్రచికిత్స చేసిన ప్రదేశంలో ఇన్‌సిషనల్ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. లేప్రోస్కోపిక్ సర్జరీ చేస్తే ఈ సమస్యలు ఉండవు. ఓపెన్ సర్జరీ చేస్తే రోగికి రెండు నుంచి మూడు నెలలు విశ్రాంతి అవరమవుతుంది. ఎటువంటి బరువులు ఎత్తకూడదు. తుమ్మడం, మొట్లు ఎక్కడం వంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తే రెండు మూడు రోజుల్లో సాధారణ పనులు చేసుకోవచ్చు.
గతంలో హెర్నియాకు ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. కాని, ఇప్పుడు లాప్రోస్కోపిక్ పద్ధతిలో రెండు,మూడు గాట్లు పెట్టి ఆపరేషన్ చేసే వీలుంది.కొన్ని ప్రత్యేక పరికరాలను లోపలికి పంపి బయటకు వచ్చిన పేగులు, ఇతర భాగాలను యధాస్థానంలో అమర్చి బలహీనపడిన ప్రాంతంలో మరల సమస్య రాకుండా మెష్ అమర్చి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది.