header

Hormones..About Hormones...

హర్మోన్స్... వివరాలు.. Hormones...

మానవ శరీరంలోని కొన్ని గ్రంథులు రక్తంలోకి నేరుగా కొన్ని రసాయన ద్రవపదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి విడుదల చేసే ద్రవ పదార్థాలను ‘హర్మోన్స్’ అని అంటారు. ఈ గ్రంథులను ‘ఎండోక్రైన్ గ్రంథులు’ అంటారు శరీరంలో జరిగే జీవ ప్రక్రియకు, నియంత్రణకు హర్మోనులే ఆధారం. ఎవరైనా వ్యక్తికి పదే పదే ఓ సమస్య ఏర్పడితే వెంటనే అది హార్మోనుల లొపం అని చెబుతారు. ప్రస్తుత కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వ సాధారణంగా మారింది. ఒత్తిడితో కూడిన జీవన శైలి మరియు తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం వలన శరీరంలో హార్మోనల్ అసమతుల్యత ఏర్పడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే హార్మోనుల అసమతుల్యత వల్ల పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ సమస్యలు కలుగుతాయి.

ఈ హార్మోన్‌లు రెండు రకాలు ఎక్సోక్రైన్, ఎండోక్రైన్.

ఎక్సోక్రైన్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు నాళాల ద్వారా స్రవిస్తాయి. ఎండ్రోక్రైన్ గ్రంథులకు నాళాలు ఉండవు, వీటి నుంచి వెలువడిన హార్లోన్లు నేరుగా రక్తంలో కలసి శరీరమంతా వ్యాపిస్తాయి. ఎక్సోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలుగా స్వేదగ్రంథులు, కాలేయాన్ని చెప్పవచ్చు. కాలేయం, క్లోమం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తాయి. ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు .....పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథులు. మగవారిలో వృషణాలు, స్త్రీలలో అండాశయాలు కూడా ఎండోక్రైన్ గ్రంథులే. హార్మోనులు తగినంత పరిమాణంలో విడుదల కావాలి. అవసరానికి మించి విడుదలైనా, తక్కువగా విడుదలైనా చెడ్డ ఫలితాలు కలుగుతాయి.
హార్మోన్ల కారణంగానే మానసిక శారీరక ఎదుగుదల జరుగుతాయి జీవక్రియలు, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు, శారీరక విధులు ఆలోచన, ఆవేశం, సెక్స్ హార్మోన్‌ల వల్లనే కలుగుతాయి శరీరంలో గ్లూకోజ్ ను నియంత్రించేదే ఇన్సులిన్. దీని లోపం కారణంగానే డయాబెటిస్ వస్తుంది
ఆర్గానిక్ ఫుడ్స్ లో రసాయనాలు ఉండవు. దీని వలన హార్మోన్ లు సమతుల్యంగా ఉంటాయి. బ్రొకోలీ, కాలీఫ్లవర్, మరియు క్యాబేజ్ శరీరంలో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తాయి. గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు హార్మోనులను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతాయి. లెంటిల్స్, పచ్చిబఠానీలు మరియు సోయా బీన్స్ వంటి వాటిలో ఈస్ట్రోజెన్అధికంగా ఉండటం వలన హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఆకుపచ్చని కూరగాయలలో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్ చేస్థాయి . హార్మోనులు నియంత్రించబడతాయి.
హార్మోనులు బ్యాలెన్స్ చేయడానికి మరో మంచి ఆహారం చేపలు . వారానికొక సారి ఫిష్ తీసుకోవడం వల్ల హార్మోనులను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తున మరియు సాల్మన్ వంటి చేపల్లో ఉండే నూనెలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వెజిటేరియన్స్ ఆలివ్ ఆయిల్, నట్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి
బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్ మరియు రెడ్ బెర్రీస్ మొదలైనవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి.
కొన్ని రకాల హార్మోన్స్ గురించి వివరాలు......

ఎండార్ఫిన్స్ :

ఇవి శరీరంలో బాధను తగ్గించి నొప్పి తలెత్తకుండా ఆపుతుంది. సంతోషానుభూతికి ఈ హార్మోన్ కారణం.
ఎండార్ఫిన్ హార్మోన్స్ విడుదల కావటానికి అతి మంచి మార్గం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమే. కారంగా ఉన్న మిర్చిబజ్జీ తిన్నపుడు లేక బాగా కారంగా ఉన్న పదార్థం తిన్నపుడు మన మెదడుకు బాధలాంటి సిగ్నల్స్ అందుతాయి. దీనితో శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, పెరుగు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి.

థైరాక్సిన్

ఈ హార్మోన్ థైరాయిడ్ గ్రంధి నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ మానవ శరీరంలోని జీవక్రియను నియంత్రిస్తుంది. జీర్ణశక్తి, గుండె, కండరాల ఫంక్షన్స్, మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. ఈ గ్రంధి శరీరంలోని గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ హార్మోన్ మన శరీరానికి తప్పని సరి అవసరం. ఈ హార్మోన్ విడుదల హెచ్చు-తగ్గుల వలన శరీరంలో వివిధ రకాల మార్పులు సంభవిస్తాయి. థైరాయిడ్ సమస్యల వలన చాలా రకాల సమస్యలు కలుగవచ్చు ఈ థైరాయిడ్ హార్మోన్ లోపం కారణంగానే థైరాయిడ్ అనే వ్యాధి వస్తుంది- శరీరం అతిగా పెరగటం లేక తగ్గటం.
థైరాయిడ్ సమస్యలకు కారణం స్వీట్స్, బిస్కెట్స్, కేక్స్ మరియు ఇతర అధిక క్యాలోరీలను అందించేవి. వేయించిన ఆహారాలను, చక్కెర ద్రావణాలను, టీ మరియు కాఫీలను కూడా తగ్గించాలి. అధికంగా నీటిని త్రాగటం మరియు తాజా పండ్ల రసాలను తాగటం. అంతేకాకుండా, తగిన సమయం పాటూ నిద్ర వలన కూడా థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామాలను అధికం చేయటం వలన శరీరానికి ఆక్సిజన్ సరఫరా ఎక్కువ అవుతుంది. దానితో థైరాయిడ్ గ్రంధి కూడా ఆరోగ్యకర స్థాయిలో ఉంటుంది.
థైరాయిడ్ సమస్యలతో భాదపడే వారు అయోడిన్'ను ఎక్కువగా తీసుకోవాలి. అయోడిన్'ను అందించే ఆహార పదార్థాలు అయినట్టి ఆస్పాగారాస్, ఓట్స్, ఉల్లిపాయ, పనస పండు, టమాట, క్యాబేజీ, అల్లం మరియు స్ట్రాబెర్రీలను తినండి. ఈ రకమైన ఆహార పదార్థాల నుండి శరీరానికి అవసరమైన స్థాయిలో అయోడిన్ అందించబడుతుంది.
విటమిన్ 'ఎ' వలన థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ 'ఎ' అధికంగా ఉన్న పచ్చని కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ 'ఎ' క్యారెట్, గుడ్లు మరియు పచ్చని ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది.

డోపమైన్

ఈ హార్మోన్ వలన కూడా సంతోషం కలుగుతుంది. ఏదైనా లక్ష్యాన్ని అందుకున్నపుడు కొంతసేపు తృప్తితో కూడిన సంతోషం కలుగుతుంది. దీనికి కారణం డోపమైన్. డోపమైన్ లోపం కారణంగానే పార్కిన్ సన్ (మెదడు లోని నరాలు క్షీణించడం) అనే వ్యాధి వస్తుంది. ఈ హార్మోన్ మొదడులోని ఒక భాగం నుండి విడుదల అవుతుంది.
డోపమైన్ ను మెరుగు పరచుకోవటం : క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన శరీరంలో డోపమైన్ స్థాయి పెరుగుతుంది. లక్ష్యం నిర్ధేశించుకుని దానిని సాధిస్తే ఆ పని వలన మనలోని ఆనందపు స్థాయి అద్భుతంగా పెరుగుతుంది.
టమాటోలు, బ్రకోలీ, అవకాడో, బంగాళాదుంపలు, కొత్తిమీర, కమలాలు, మొలకెత్తిన గింజలు, మొదలైన వాటినుండి డోపమైన లభిస్తుంది. చాకొలెట్లు, బ్లూబెర్రీలు, చిలగడదుంపలు, బ్రకోలీ ఆనందమయ జీవనానికి కారణమైన డోపమైన్‌ను విడుదల చేస్తాయి.
అరటి పళ్లు, ప్రొటీన్ అధికంగా లభించే ఆహారపదార్ధాల వలన డోపమైన్ స్థాయి పెరుగుతుంది. ఇంకా ఆలివ్ ఆయిల్, వేరుశెనగప్పులు, ఓట్స్, పుదీనా, పుచ్చకాయ, సోయా ఉత్పత్తులు, నువ్వులు, పసుపు వంటి వంటిని వాడటంతో ఈ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి.

ఘ్రెలిన్

దీనిని హంగర్ హార్మోన్ గా పిలుస్తారు. ఆకలిని ఉద్దీప్తం చేయటంలో హైపోథాలమస్ పై పనిచేస్తుంది. ఆహారం తిన్న తరువాత ఘ్రెలిన్ స్థాయిలు తగ్గిపోతాయి. తరువాత ఆహారం తీసుకునే సమయాని వీటి స్థాయి పెరిగి ఆకలి పెరుగుతుంది.

గ్రోత్ హార్మోన్

మన ఎదుగుదలకు కారమణమయ్యే గ్రోత్ హార్మోన్ ను పిట్యుటరీ గ్రంథి తయారు చేస్తుంది

ఇన్సులిన్

మనం తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ ను శరీరంలోని జీవకణాలు గ్రహించి శక్తిని పొందుతాయి. ఈ గ్లూకోజ్ ను జీవకణాలు గ్రహించటానికి ఇన్సులిన్ తాళం చెవిలాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి అయినపుడు మాత్రమే గ్లూకోజ్ ను జీవకణాలు గ్రహిస్తాయి. ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి కానపుడు లేక పూర్తిగా ఉత్పత్తి కానపుడు గ్లూకోజ్ రక్తంలో అధికంగా నిల్వ ఉండి పెద్దవారిలో టైప్-1, చిన్న పిల్లలలో టైప్ – 2 డయాబెటిస్ వస్తుంది. వీరినే షుగర్ వ్యాధిగ్రస్తులు అని కూడా అంటారు. డయాబెటిస్ కు కారణం ఇన్సులిన్

లెప్టిన్

హర్మోన్ ఆఫ్ ఎనర్జీ ఎక్సె పెండిచర్ గా ఈ హార్మోన్ ను పేర్కొంటారు. ఆకలిని అడ్డుకోవటం ద్వారా శక్తి సమతౌల్యాన్ని క్రమబద్దీకరిస్తుంది. తక్కువ ఆకలి ఉంటే తక్కువ ఆహారం తింటారు. తరువు తగ్గుతారు. స్థూలకాయులలో లెప్టిన్ ను నియంత్రించే శక్తి ఉండదు. అందుకనే అధికంగా ఆహారం తింటారు.

ఆక్సిటోసిన్‌

ఈ హార్మన్ వలన పునరుత్పత్తి వ్యవస్థ, శిశు జననం, బాలింతలలో పాలు పడటం లాంటి విషయాలను నియంత్రిస్తుంది. ఇది కుంగుబాటు తనానికి పూర్తి వ్యతిరేకి. తేలికపాటి వ్యాయామాలు, యోగా వలన ఈ హార్మోన్ పెరుగుతుంది. ఆక్సిటోసిన్ ఇంజక్షన్ లను పాడిపశులకు ఇచ్చి వాటినండి అమానుషంగా పాలను పూర్తిగా సేకరిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఇంజక్షన్ లను పశువులకు చేయటం నిషేధించబడింది. గుమ్మడి విత్తనాలు, బంగాళాదుంపలు, క్వినోవా, నువ్వులు ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ని ఉత్పత్తి చేస్తాయి.

టెస్టాస్టిరాన్

టెస్టోస్టిరాన్‌ పురుషుల్లో బీజాల నుండి, ఎడ్రినల్‌ నుండి టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉత్పత్తి అవుతుంది. పురుషుల మగతనానికి ఇది అత్యంత ముఖ్యమైంది. ఇది లేకపోతే మీసాలు, గడ్డాలు పెరగవు. గొంతులో మార్పు రాదు. సెక్స్‌లోపం కూడా సంభవిస్తుంది. మహిళల్లో కూడా టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉంటుంది. కాకపోతే పురుషుల్లో కన్నా బాగా తక్కువగా ఉంటుంది. మహిళల్లో ఎడ్రినల్‌ గ్రంథుల నుండి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అవుతుంది. పురుషుల్లో ప్రతి 100 మిల్లీలీర్ల రక్తంలో 300 నానోగ్రాముల నుండి 1200 నానోగ్రాముల దాకా టెస్టోస్టిరాన్‌ ఉంటుంది. మహిళల్లో ప్రతి 100 మిల్లీలీరట్ల రక్తంలో 15 నుండి 100 నానోగ్రాముల పరిమాణంలో టెస్టోస్టిరాన్‌ ఉంటుంది.
టెస్టాస్టిరాన్ స్థాయిలు తగ్గితే శారీరకంగా ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ హార్మోన్ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలంటే ఈ క్రింది అంశాలను మీరు గుర్తుంచుకోవాలి.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలి. జింకు, మెగ్నీషియం లాంటి లోహాలు టెస్టాస్టిరాన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ లోహాలందే ఆహారం తినడం మగవారిలో టెస్టాస్టిరాన్ స్థాయి పెరగడానికి చాలా ముఖ్యం. ఒత్తిడి తగ్గించుకోవాలి.
చక్కర తీసుకున్నప్పుడు శరీరంలో టెస్టాస్టిరాన్ స్థాయి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. చక్కర ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరిగా తగ్గించుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. విపరీతంగా వ్యాయామాలు చేయకూడదు.

ఆండ్రోజన్లు

ఇవి పురుషు లైంగిక హార్మోనులు. ఇవి మహిళల్లో లైంగిక వాంఛను, శక్తిని, ఎముకల సాంధ్రతను, కండరాల పటుత్వాన్ని పెంచుతాయి. అండాల్లోని పురుష హార్మోనుల చురుకుదనం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి నియంత్రణలో ఉంటుంది. అండాశయంలో ఫాలికిల్స్‌ ఉంటాయి. వీటిని పుటికలు అంటారు. ఇవి కూడా ఒక రకమైన కణాలు. ఫాలికిల్స్‌ నుండి అండాలు విడుదలవుతాయి. పురుష హార్మోనులు ఫాలికిల్‌ పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఇవి ఫాలికిల్‌ ఎదుగుదలను, అభివృద్ధిని నియంత్రిస్తాయి. అదే సమయంలో పెరుగుతున్న అండాలు కలిగున్న ఫాలికిల్స్‌ క్షీణించడాన్ని నివారిస్తాయి.