header

Joint Replacement……తుంటి మార్పిడి…

Joint Replacement……తుంటి మార్పిడి…
డా॥ అఖిల్‌ దాడి, చీఫ్‌ ఆఫ్‌ ఆర్ధోపెడిక్‌ యూనిట్‌-2, సన్‌షైన్‌ హాస్పటల్స్‌, సికింద్రాబాద్‌
మంచం మీద నుంచి కిందకు దిగాలంటే కాలు సహకరించదు. ..పట్టుమని పదడుగులు వేయాలంటే భరించలేని నొప్పి... తుంటిలో అరుగుదల కారణంగా మంచానికే అంటి పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అరుగుదలకు పుట్టుకతోనే వచ్చే లోపాలు కొన్నయితే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులు కూడా కారణలు. తుంటి మార్పిడి సర్జరీ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. సన్‌షైన్‌ హాస్పిటల్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ అఖిల్‌దాడి.
కీళ్లవాతం కారణంగా తుంటి ఎముక అరిగిపోతుంది. అలాగే ఎప్పుడో తగిలిన గాయం కారణంగా కూడా తుంటి జాయింట్‌లో అరుగుదల ఏర్పడుతుంది. మరో ముఖ్యమైన కారణం అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌. దీనివల్ల వెన్నెముక నుంచి తుంటి వరకు మొత్తం కీళ్లన్నీ కలిసిపోయి నడుం కర్రలా బిగుసుకుపోతుంది. అలాంటి పరిస్థితిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటి మార్గం. అసలు తుంటి మార్పిడి అవసరం ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకుందాం.
తుంటి మార్పిడి అవసరం ఎప్పుడు?..... తుంటిలో ఉండే బంతి (బేరింగ్‌ లా పనిచేసేది) రక్తప్రసరణ తగ్గిపోయి ఆ బంతిలో ఉన్న ఎముక చనిపోవటం వల్ల బంతి అరిగిపోతుంది. దాంతోపాటు బంతి ఉన్న గిన్నె (ఎస్టాబ్లెమ్‌) కూడా అరుగుదలకు దారితీసి తుంటి జాయింట్‌ అన్నది పూర్తిగా అరిగిపోతుంది. ఆ పరిస్థితి ఎవస్కో లెక్లోసిస్‌ (ఎవిఎల్‌) లేదా అంతకు ముందు తగిలిన గాయాల కారణంగా ఏర్పడుతుంది. ఈ రెండు ముఖ్యమైన కారణాలు 20-40 మధ్య వయస్కులో ఏర్పడతాయి. చిన్న వయసు వారికి కూడా తుంటి మార్పిడి అవసరమవుతుంది. ప్రధానంగా ఈ పరిస్థితి స్త్రీలోనే అధికంగా ఏర్పడుతుంది.
తుంటి మార్పిడి చేసుకోవడానికి మరో ముఖ్యమైన కారణం అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌ అనే వ్యాధి. ఇది పురుషులలో అధికంగా వస్తుంది. 20-40 మధ్య వయసులో ఈ వ్యాధి అధికంగా తలెత్తుతుంది. వెన్నెముక నుంచి తుంటి దాకా అన్ని జాయింట్లు ప్యూజ్‌ అయిపోవడం అంటే ఒకటైపోవడం (కలసిపోవడం) వల్ల వచ్చే వ్యాధిని అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌ అంటాం. ఈ వ్యాధికి సంపూర్ణమైన వైద్యం లభించదు.
ఈ వ్యాధి కారణంగా రాను రాను మెడ నుంచి వెన్నెముక వరకు మొత్తం కదలిక లేకుండా స్తంభించిపోతుంది. మెడ తిప్పడం, నడుం వంచడం కష్టమవుతుంది. తుంటి దగ్గర కదలిక ఉండకపోవడంతో వెన్ను వెదురు బద్దలా బిగుసుకుపోతుంది. ఈ వ్యాధితో బాధపడే రోగులకు తుంటి మార్పిడి సర్జరీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని చెప్పవచ్చు. తుంటి అరుగుదలో వచ్చిన మార్పును తుంటి మార్పిడి సర్జరీతో మళ్లీ కదలికను రప్పించవచ్చు. అలాగే దీనివల్ల నడుంపైన పడిన ప్రభావాన్ని తగ్గించవచ్చు
కొందరికి పుట్టుకతోనే తుంటిలో ఉన్న ఎముక అరుగుదల తొడ ఎముకలో మార్పు ఉండడం వల్ల తుంటి మార్పిడి అవసరమవుతుంది. ఇది శ్రమతో కూడుకున్న సర్జరీ. ఈ సర్జరీని అనుభవజ్ఞులైన కొంతమంది నిపుణులు మాత్రమే చేయగలరు.
సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి? తుంటిలో నొప్పి అధికంగా ఉండడం. ఆ నొప్పి వల్ల కదలిక పూర్తిగా లేకపోవడం, ఎక్కువసేపు నిబడలేకపోవడం, నాలుగడుగులు కూడా వేయలేకపోవడం, కూర్చున్నవారు లేవలేకపోవడం, మంచం మీద కిందకు దిగడానికి కూడా కాలు సహకరించకపోవడం, నొప్పితో ఒక కాలు మీద అసలు నిబడలేకపోవడం, అలాగే ఎక్సెరే లో బాగా అరుగుదల కనిపించినపుడు తుంటి మార్పిడి సర్జరీ అవసరమవుతుంది.
సర్జరీ ఎలా జరుగుతుంది? తుంటిలో ఉండే బంతి (బాల్‌) గిన్నె (ఎస్టాబ్లెమ్‌) అరిగిపోవడాన్ని హిప్‌ ఆర్థరైటిస్‌ అంటారు. బంతిని గిన్నెను కృత్రిమ కప్పుతోటి, బంతిని ఒక స్టెమ్‌తోటి అమరిక ఉంటుంది. ఈ స్టెమ్‌ తొడపై ఎముక మూలగ లోపలకు చొప్పించడం జరుగుతుంది. అయితే కొద్ది మందికి మాత్రం ఇలా ఎముక మూలగలోకి వెళ్లే స్టెమ్‌ కాకుండా అరిగిపోయిన బంతిని సర్ఫేస్‌ రిప్లేస్‌మెంట్‌ ద్వారా మార్పిడి చేయడం జరుగుతుంది. ఈ బంతికి, గిన్నెకు మధ్య కదలికు సాఫీగా జరగడానికి వివిధ రకాల ఇంప్లాట్స్‌ ను వాడటం జరుగుతుంది. మొదట గిన్నె వైపు ప్లాస్టిక్‌ని, బంతివైపు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మెటల్‌ని వాడడం మొదలైంది. ఇప్పటికి కూడా ఇదే అత్యుత్తమ ఫలితాలను ఇస్తోంది. మధ్యలో కొంతకాలం గిన్నె వైపు మెటల్‌, బంతి వైపు మెటల్‌ అన్‌ మెటల్‌ వాడడం జరిగింది. కాని దీంతో చాలామందికి సర్జరీ ఫెయిల్‌ కావడం, మెటల్‌ రక్తప్రసరణ ఎక్కడం, మెటల్‌ ఎముకను పూర్తిగా తినేయడం వంటివి జరగడంతో ప్రస్తుతం ఈ పద్ధతిని ఉపయోగించడం లేదు. ప్రస్తుతం గిన్నె వైపు బంతి వైపు సిరామిక్‌ అన్‌ సిరామిక్‌ అంటారు. జర్మనీ లో తయారయ్యే ఈ సెరామిక్‌ మెటల్‌ ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. గతంలో సెరామిక్‌ అన్‌ సెరామిక్‌ కారణంగా రాపిడి కలిగి కరకరమని కీళ్లలో శబ్ధాలు రావడం జరిగేది. అయితే ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరా వల్ల ఈ శబ్ధాలు రావడం లేదు. అలాగే కదలికలు కూడా చాలా స్మూత్‌గా ఉంటున్నాయి.
ఎముకలలో ఎలా పట్టు చిక్కుతుంది? ఎముక మూలిగ లోపలకు చొప్పించే ఈ స్టెమ్‌కు గిన్నెకు పట్టు చిక్కడం రెండు విధాలుగా జరుగుతుంది. ఎప్పుడైతే పట్టుకోసం సిమెంట్‌ వాడడం జరుగుతుందో దీన్ని సిమెంట్‌డ్‌ అంటాము. గత 50 ఏళ్లుగా సిమెంటెడ్‌ విధానం కొనసాగుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, అంకైలోజింగ్‌ స్పాండలైటిస్‌ ఉన్నవారిలో వృద్ధులలో ఎవరికైతే కాల్షియం బాగా తక్కువ ఉందో వారిలో ఎముకలో పట్టుచిక్కడానికి సిమెంటెడ్‌ వాడడం జరుగుతుంది. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో గత కొద్దికాలంగా ఆన్‌సిమెంటెడ్‌ వాడడం జరుగుతుంది. ఆ అన్‌సిమెంటెడ్‌ విధానంలో గిన్నెకు, స్టెమ్‌కు స్పెషల్‌ కోటింగ్‌ ఉంటుంది. వీటిని నేరుగా ఎముకలోకి చొప్పించడం జరుగుతుంది. మూడు నెలల్లో సాధారణ ఎముక ఈ కోటింగ్‌లోకి చొచ్చుకుపోవడం జరుగుతుంది. వీలైనంతవరకు అన్‌సిమెంటెడ్‌ చేయాలన్నది వైద్యుల ప్రయత్నమని చెప్పవచ్చు. కాని ఎక్కడైతే కాల్షియం బాగా తక్కువ ఉంటుందో అక్కడ మాత్రమే అన్‌సిమెంటెడ్‌ చేయడం జరుగుతుంది.
దుష్ప్రభావం: తుంటి మార్పిడి సర్జరీ చేసినపుడు ఒక్కోసారి ఇంప్లాట్స్‌ పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. బంతి కప్పు నుంచి పక్కకు జరిగిపోవడం కొన్ని సందర్భాలలో జరుగుతుంది. ఇటువంటివి జరుగకుండా ఉండాలంటే రోగి సైజుకు తగ్గ గిన్నెబంతి ఇంప్లాంట్స్‌ వేయడం మంచింది. సర్జరీ లో ఖచ్చితత్వాన్ని సాధించడానికి రానున్న కాలంలో కంప్యూటర్‌ నావిగేషన్‌ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
ఆధునిక వైద్య విధానం
1) పూర్తి స్ధాయిలో అన్‌సిమెంటెడ్‌ వాడకం.
2)సెరామిక్‌ అన్‌ఫాలీ లేదా సెరామిక్‌ అన్‌ సెరామిక్‌ వాడకం పెరుగుదల.
3) చాలా చిన్న గాటుతో సర్జరీ చేయడం.
4) బంతి, గిన్నె సైజు రోగుల అవయవాల సైజు ప్రకారం తయారుకావడం.
5) ఇంప్లాట్స్‌ అరుగుదల చాలా తక్కువగా ఉండడం వల్ల కనీసం 15 నుంచి 20 ఏళ్లు ఇది వాడుకలో ఉంటుంది.
6) ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇంప్లాట్స్‌ను సవరించవలసిన అవసరం ఏర్పడితే రివిజన్‌ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉంది