header

Paralysys….పక్షవాతం

Paralysys….పక్షవాతం

మనిషిని అకస్మాత్తుగా నిర్వీర్యం చేసి, నిట్ట నిలువునాపడ దోస్తుంది. మెదడులోని రక్తనాళంలో అడ్డంకి ఏర్పడటమో, చిట్లటమో.. కారణమేదైనా మెదడుకు రక్తసరఫరా ఆగిపోవటం దీనికి మూలం. ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక ఆయా భాగాలు చచ్చుబడిపోతుంటాయి. పక్షవాత లక్షణాలు మొదలైన తొలి గంట ‘అతి విలువైన సమయం’. ఎందుకంటే ఈ సమయంలో చికిత్స ఆరంభిస్తే చాలావరకు కోలుకునే అవకాశముంది. మెదడు మరీ ఎక్కువగా దెబ్బతినకుండా, శాశ్వత వైకల్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు.
మెదడులోని కుడి భాగాంలో రక్త నాళాలు దెబ్బ తింటే శరీరంలోని ఎడమ భాగానికి పక్షవాతం వస్తుంది. ఎడమ భాగంలోని రక్త నాళాలు దెబ్బ తింటే శరీరంలోని కుడి భాగానికి పక్షవాతం వస్తుంది.
వచ్చే మందు సూచనలు
ఉన్నట్టుండి ముఖం, చేయి, కాలు మొద్దుబారినట్టు అనిపించటం. ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనమవుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించటం. అకస్మాత్తుగా మాట తడబడిపోవటం. అంతా అయోమయంగా అనిపిస్తుండటం. ఎదుటివాళ్లు చెప్పేవి అర్థం కాకపోవటం. ఉన్నట్టుండి ఒక కంట్లో గానీ రెండు కళ్లలో గానీ చూపు తగ్గినట్టు అనిపించటం. హఠాత్తుగా నడక తడబడటం. తల తిరుగుతున్నట్టు, పట్టు తప్పి తూలి పడిపోతున్నట్టు అనిపించటం. ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి రావటం.