కాలేయం ఆరోగ్యం కోసం రోజువారీ ఆహారంలో భాగంగా ఈ క్రింది ఆహార పదార్ధాలను తీసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
- బీటాకెరోటిన్, ఇతరత్రా ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండే బీట్‌రూట్, కాలేయం ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది.
- పాలకూర, తోటకూర... వంటి ఆకుకూరల్లోని క్లోరోఫిల్ కారణంగా రక్తంలోని హానికర రసాయనాలు బయటకుపోయేలా చేయడంలో కాలేయానికి సహకరిస్తాయి.
- క్యారెట్లూ, అవకాడోలను ఎక్కువగా తీసుకోవడంవల్ల వాటిల్లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలోని హానికర రసాయనాలను వడబోసినట్లుగా తొలగిస్తాయి.
- అక్రోట్లలోని ఫ్యాటీఆమ్లాలు కూడా కాలేయ పనితీరుకి తోడ్పడతాయి. పసుపుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కాలేయానికి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లూ సోకకుండా ఉంటాయి.
- క్యాబేజీ, బ్రకోలీ ఎక్కువగా తినేవాళ్లకి కాలేయ సంబంధిత వ్యాధులు రావంటారు