మంచి ఔషధ లక్షణాలు కలిగి, నేరుగా తినగలిగిన ఆకులు పొదీనా ఆకులు. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.
నోటి దుర్వాసనతో బాధపడేవారు కొన్ని పొదిన ఆకులను తరచుగా నములుతుంటే నోటిలో ఇన్ ఫెక్షన్ తగ్గి నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల వ్యాధికూడా తగ్గుతుంది. అజీర్తి చేసినపుడు, తిన్న పదార్ధాలు అరగనపుడు కొన్ని పొదీనా ఆకులను తింటే ఫలితం ఉంటుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపి మలవిసర్జన సాఫీగా జరగటానికి సాయపడుతుంది.
పొదీనా టీ తాగితే మంచి రుచితో పాటు ఉత్తేజకరంగా ఉంటుంది.
తులసీ ఆకులలో అధ్భుతమైన ఔషధ గుణాలున్నాయి. భారతీయు శతాబ్ధాల తరబడి తులసి చెట్టును పవిత్రమైన మొక్కగా భావించి పూజలు చేస్తున్నారు. మన పూర్వీకులు తులసి ఆకులలో ఉన్న ఔషధ గుణాలను గుర్తించి దేవుడి పేరుతో తులసి చెట్టు చుట్టూ తిరగటం, పూజలు చేయటం అచారాన్ని ఏర్పరచాయి. తులసి చెట్లగాలి తగిలినా శరీరానికి మంచి జరుగుతుంది. హిందువులు తమ ఇళ్లలో తప్పకుండా తులసి మొక్కలు పెంచుకుంటారు.
వర్షాకాలంలో తరచుగా బాధించే జబ్బు, దగ్గుల నుండి తులసీ ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. జలుబు, దగ్గులతో బాధ పడేవారు నేరుగా కొన్ని తులసి ఆకులను కొన్నిరోజుల పాటు తింటే ఫలితముంటుంది. లేక తులసీ ఆకులతో టీ తయారుచేసుకొని తాగవచ్చు. నోరు తాజాగా ఉంటుంది. నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వీటి ఫలితాలు దక్కాలంటే కొన్ని రోజులపాటు తప్పనిసరిగా వాడాలి. ఒకటి రెండుసార్లు వాడితే ప్రయోజనం ఉండదు.
సూపర్ మార్కెట్లలో ఎండబెట్టిన తులసి ఆకులు లభిస్తున్నాయు. వీటినే నేరుగా టీ చేసుకొని తాగవచ్చు.
ఈ కులనే రాజ్ గిరి ఆకులని కూడా పిలుస్తారు. కొద్దిగా ఎరుపు, ఆకుపచ్చ రంగులలో ఉంటాయి. దక్షిణ భారత తీర ప్రాంతాలలో మరియు హిమాలయ పర్వతాలలలో వీటిని గుర్తించారు.
వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పోటాషియం తోపాటు విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్లు, విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తాయి.
భారతదేశంలో సాధారణంగా మునగకాయలు ఎక్కువగా కూరలు వండటానికి, సాంబారులో వాడటానికి ఉపయోగిస్తారు తప్ప మునగ ఆకును ఎక్కువగా ఉపయోగించరు. కానీ మునగ ఆకుల ప్రయోజనాన్ని గుర్తించిన పాశ్ఛాత్య దేశాల వారు మునగ ఆకులను దిగుమతి చేసుకొని ఉపయయోగిస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో మునగ ఆకును ప్రత్యేకంగా పండించి ఎగుమతి చేస్తున్నారు.
మున ఆకులలో విటమిన్ కె, సిలు పుష్కలంగా ఉన్నాయి. క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి2, బీటా కెరటోన్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయు.
మునగ ఆకులు, బెరడు, పూలు, గింజలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు.
మునగ ఆకులను, పెసరపప్పుతో కలిపి వండుకుని చపాతీలలోకి లేక కూరగా తినవచ్చు.
మునగాకు కారం కూడా చేసుకొనవచ్చు. స్పూను నూనెలో కొద్దిగా మునగాకును వేయించుకొని, అందులో ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, కొద్దిగా నువ్యులు, కొద్దిగా ఇంగువ కలుపుకుని కారంగా చేసుకోవచ్చు. మునగాకు కొద్దిగా వగరుగా, చేదుగా ఉంటుంది. నువ్వులు కలిపితే మునగాకు కారంలో చేదు, వగరు పోయి మంచి రుచి వస్తుంది.
భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో విస్తృతంగా ఈ ఆకు దొరకుతుంది. ఈ ఆకులలో సహజమైన పీచు అధికంగా ఉంటుంది. ఈ పీచుసహజమైన విరోచన కారి (Laxative) గా పనిచేస్తుంది, డైయురెటిక్ (diuretic) మూత్రవిసర్జన సాఫీగా జరగటానికి తోడ్పడుతుంది. ఎలర్జీనుండి ఉపశమనం కలుగుతుంది.
చర్మం, ఎముకలు, మూత్రనాళ ఆరోగ్యంలో సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.
భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో బచ్చలి కూర విరివిగా దొరకుతుంది. బచ్చలిలో క్యాలరీలు అత్యంత తక్కువగా వుంటాయి. విటమిన్ ఎ, సి, ఐరన్, ఫోలేట్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మొదడు నరాలకు చాలా మంచిది. ఇందులో కాడబచ్చలి, తీగబచ్చలి అనే రెండురకాలున్నవి.
యాంటీ ఆక్సిడెంట్లుగా(వ్యాధినిరోధక కణాలు) పని చేసి, ఫ్రీరాడికల్స్(శరీరంలో కణాల నుండి ఏర్పడే మలినాలు) నుంచి రక్షించటంలో సాయపడతాయి.
దక్షిణ భారతదేశంలో గోంగూర అంటే తెలియని వారుండరు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఆంధ్రామాతగా పేరుపొందిన అద్భుతమైన ఆకుకూర. గోంగూరలో రెండు రకాలున్నాయి. ఎర్రగోంగూర, తెల్ల గోంగూర.
పుల్లగా ఉండే గోంగూరలో విటమిన్లు, ఖనిజాలు, ఆర్గానిక్ పోషకాలు, ఆక్సాలిక్ యాసిడ్స, ప్రోటీన్లు, పీచు ఎక్కువగా ఉంటాయి.
ఆహారంగానే కాకుండా ఔషధపరంగా కూడా మేలుచేస్తుంది. రక్తహీనత కలవారు తరచుగా గోంగూరతో చేసినవి తింటే శరీరంగా తగినంత ఇనుము తయారై రక్త అభివృద్ధికి తోడ్పడుతుంది. వాపులను తగ్గించటంలో, క్యాన్సర్ చికిత్సలో, రక్తపోటు నియంత్రణలో చక్కగా పనిచేస్తుంది. గోంగూరను పచ్చడిగా లేక పప్పు కూరగా చేస్తారు.
.భారతదేశంలో సంప్రదాయ వైద్యంలో వాడే ఔషధ గుణాలున్న మొక్క గోటుకోల.
ఐరన్, డయటరీ (కరిగే) పీచు వీటిలో లభిస్తుంది. దాయాలను మాన్పటంలో, వెరికోస్ (కాలినరాలు గూడుకట్టటం) వెయిన్స్ చికిత్సలో, జ్ఞాపక శక్తిని పెంచటంలో, ఆందోళనను (anxiety) వ్యాకులత మరియు ఒత్తిడిని తొలగించటంలో ఉపయోగకరంగా ఉంటుంది. చర్మం మీద ఏర్పడే చారలను తగ్గించడంలో సాయపడుతుంది.
గోటుకోల చైనావారికి, ఇండోనేషియా వారికి వ్యాపార వస్తువు కూడా. ఈ ఆకు పొడి రూపంలో కూడా దొరకుతుంది. అమెజాన్ లో లేక వాల్ మార్టులలో లభిస్తుంది.