ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ సంస్కృతిలో ప్రకృతికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగలైనైనా ప్రకృతి ఆరాధన తప్పకుండా మిళతమై వుంటుంది. అందులో ఉగాది పండుగకోసం వేపచెట్టు..
అలాగే సంక్రాంతి పండుగ ధాన్యరాశులు, పశుసంతతి పట్ల ప్రేమ చూపడం..
అదే విధంగా వినాయకచవితి అంటే అనేక విధాలైన ఫల, పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించడం జరుగుతుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి ఏ ఇతర మతంలోనూ కనిపించదు.
హిందూ సంస్కృతిలో తాంబులానికి - అంటే తమలపాకులకు కూడా ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్లకయితే నిర్ణీత సంఖ్యలో వీటిని కేటాయించి పూజలు చేస్తారు. ఇలాగే ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తాంబూల సేవనాన్ని సూచిస్తుంది
ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలను పక్కనబెడితే... శరీరానికి తాంబూల సేవనం ఎంతో ఉపయోగకరమైనది. మానవ శరీర ఎముకలలో వుండే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి పోషకాలు కూడా తమలపాకులో
పుష్కలంగా వుంటాయి. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
తమలపాకులో పీచుపదార్థం (ఫైబర్) కూడా అధిక మొత్తంలో వుంటుంది. ఏవిధంగా అయితే ఆకుకూరలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో
అదేవిధంగా తమలపాకులు కూడా పనిచేస్తాయి