telugu kiranam

Why wear blob in forehead….? నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ………..

Why wear blob in forehead….? నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ………..

హిందూ సాంప్రదాయంలో బొట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
అందం కోసం మరియు ఆధ్యాత్మికత కోసం... పిల్లలు, పెద్దలూ, మగవారు, స్త్రీలు అంతా నుదుట బొట్టు ధరించడం భారతీయ సనాతన సంప్రదాయం. చందనం, విభూతి, కుంకుమ... ఏది ధరించినా మంచిదేనని హైందవ ధర్మం తెలుపుతుంది. నుదుటిలో రెండు కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం మీద వేలితో నెమ్మదిగా నొక్కుతూ సిందూరాన్ని కానీ, కుంకుమను కాని పెట్టుకోవటం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తినీ ఆలోచనాశక్తీ పెంపొందిస్తాయని యోగశాస్త్రం తెలుపుతుంది.
పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవటం ముత్తైదువుల ఐదోతనానికి చిహ్నంగా భావిస్తారు హిందూ స్త్రీలు. శుభకార్యాలకు బొట్టుపెట్టి పిలవటం హిందూ సాంప్రదాయం.
నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తికేంద్రంగానూ పరిగణిస్తారు. అది పీనియల్‌ గ్రంథి స్థానం కూడా. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్ళను దూరం చేస్తుందనీ మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందనీ చెబుతారు శాస్త్రనిపుణులు. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి అందం కూడా వస్తుంది. చూసేవారికి కూడా ముచ్చటగా ఉంటుంది.బొట్టు పెట్టుకున్నవారి మీద ఎదుటవారిలో గౌరవం కలుగుతుంది