telugu kiranam

Rudrakshalu

Rudrakshalu

Rudrakshalu….రుద్రాక్షలు... రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్ను అని అర్ధం. రుద్రుడి కంటినుంచి జాలువారింది కాబట్టి రుద్రాక్ష అనే పేరు వచ్చిందంటారు. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు చాలాకాలం తపస్సు చేసిన తరువాత కళ్ళు తెరచినపుడు ఆయన కంటి నుంచి ఓ కన్నీటి బొట్టు జారి నేలమీద పడిందంటారు. అదే రుద్రాక్ష చెట్టుగా మొలచిందంటారు.
హిందువులు, సిక్కులు, బౌద్ధులు పదో శతాబ్ధం నుంచే వీటిని ధరిస్తున్నట్లు చరిత్ర వలన తెలుస్తుంది. రుద్రాక్ష ఏకాగ్రతనూ, యోగశక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది. రుద్రాక్ష ఔన్నత్యాన్ని గ్నురించి శివపురాణం, పద్మపురాణాం, శ్రీమద్భాగవతం లాంటి పురాణాలు వివరిస్తున్నాయి. .
ఆధునిక పరిశోధన ప్రకారం రుద్రాక్షలకు ఉన్న అయస్కాంత, ప్రేరణ శక్తి వలన అవి మనిషి మానసికస్ధితి మీదా శారీరక రుగ్మతల మీద ప్రభావం చూపగలవని తేలింది. ఈ మాలను ధరించినపుడు రుద్రాక్షలోని విద్యుదయస్కాంత శక్తి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె సవ్యంగా పనిచేసేలా ప్రభావం చూపిస్తుందని ఐఐటి మరియు బెనారస్‌ పరిశోధకు తేల్చారు. .
ఆయుర్వేద గ్రంథాల ప్రకారం రక్తంలోని వ్యర్ధాలను తొలగించడంతో పాటు శరీరం లోపలా వెలుపలా ఉన్న బాక్టీరియాతో కూడా పోరాడే శక్తి రుద్రాక్షలకు ఉంటుదని తెలుస్తుంది. .
రుద్రాక్ష చెట్లు : రుద్రాక్ష చెట్లు ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. 70 శాతం ఇండోనేసియాలో, 25 శాతం నేపాల్‌లోనూ మిగ్నతా 5 శాతం భారత్‌లోను ఉన్నాయి. .
రుద్రాక్ష కాయలు : నీలం రంగులో ఉండే రుద్రాక్ష కాయలు ఎండిన తరువాత పైనున్న పొరపోయి లోపులున్న విత్తనం మిగులుతుంది. అదే రుద్రాక్ష. రుద్రాక్ష మీద పైనుంచి కిందివరకు కనిపించే గీతలనే ముఖాలంటారు. ఒక గీత ఉంటే ఏకముఖ రుద్రాక్ష అని రెండు గీతలుంటే ద్విముఖ రుద్రాక్ష అని అంటారు. ఇలా 21 ముఖాల దాకా రుద్రాక్షకు ఉంటాయి. .
ప్రతి చెట్టుకు అన్ని ముఖాలున్న రుద్రాక్షలు కాస్తాయి. అయిదు ముఖాలున్న రుద్రాక్షలు తరువాత నాలుగు, ఆరు ముఖాలున్న రుద్రాక్షలు ఎక్కువగా దొరకుతాయి. వీటి ధరలు తక్కువగా ఉంటాయి. మిగిలినవి చాలా తక్కువగా దొరకుతాయి. .
ముఖాలు పెరిగేకొది ధరకూడా పెరుగుతుంది. ఏకముఖి, 21 ముఖాలున్న రుద్రాక్షకు ఎక్కువ శక్తి ఉందని నమ్మకం. రుద్రాక్ష మనిషి చుట్టూ పాజిటివ్‌ శక్తిని సృష్టిస్తుంది. .
నిజమైన రుద్రాక్షను తెలుసుకొనే విధానం : ఈ రుద్రాక్షలను జాగ్రత్త ఎంచుకొని కొనాలి. కొందరు కృత్రిమంగా ముఖాలను చెక్కుతారు. రుద్రాక్ష లాగానే కనిపించే నకిలీ రుద్రాక్షలు కూడా ఉంటాయి. ఇవి విషపూరితమైనవి, ధరించరాదు. నిజమైన రుద్రాక్షను ఒక రాగినాణెం మీద పెట్టి ఇంకొక రాగినాణెం దాని దగ్గరగా తీసుకువెళితే రుద్రాక్షలోని విద్యుత్‌ అయస్కాంత శక్తి మూలంగా రుద్రాక్ష నెమ్మదిగా సవ్యదిశలో తిరుగుతుంది. ఇలా రుద్రాక్ష అసలైనదో కాదో తేల్చుకోవచ్చు. భక్తి, ఆధ్యాత్మిక భావంతో వీటిని ధరించేవారు స్నానం చేసేటపుడు, కాకృత్యాలు తీర్చుకునేటపుడు, శృంగార సమయంలోనూ, కొన్ని సమయాలో వీటిని ధరించరు.