india tour header

Ajanta Caves

ajantha caves అజంతా గుహలు
ఔరంగాబాద్ నుండి 107 కి.మీ దూరంలో ఉన్న వఘోరా నదీ తీరంలో గుర్రపునాడా ఆకారంలో గల సహ్యాద్రి కొండచరియలలో ఈ గుహలను మలచారు. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్ధం నుండి క్రీస్తుశకం ఆరో శతాబ్ధం వరకు వీటిని తొలచినట్లు తెలుస్తుంది. ఈ గుహలకు 12 కి.మీటర్ల దూరంలో ఉన్న అజంతా గ్రామం వలన వీటికి అజంతా గుహలని పేరు వచ్చింది.
ajanta cave గుహల వివరాలు : ఈ గుహల సంఖ్య మొత్తం 30. వీటిని ఇక్కడ వున్న శాసనాల ప్రకారం రెండు విభాగాలుగా విభజించారు. 9,10,12,13 15 ఏ గుహలు శాతవాహనుల కాలానికి సంబంధించినవిగానూ, 1 నుండి 8 మరియు 11,14-29 గుహలు ఈ ప్రాంతాన్ని పాలించిన వాకాటక రాజు హరిసేనుని (క్రీ.శ 460-480) కాలానికి చెందినవిగా గుర్తించారు. మొత్తం గుహలలో కొన్ని మాత్రం అసంపూర్ణంగా ఉన్నాయి. 9,10,19,26,29 గుహలు చైత్యమండపాలు (బౌధ్దాలయాలు) మిగిలినవి బౌద్ధ భిక్షువుల ఆవాసాలు. చైత్య గుహలలో 9,10 విహారాలలో 12,13 బుద్ధుని విగ్రహాలను కాకుండా మత చిహ్నాలైన స్తూపం, చక్రం, బోధివృక్షాన్ని పూజించే హీనయాన కాలాన్ని సూచిస్తాయి. మిగతా గుహలు మహాయానాన్ని చూచిస్తాయి. అనగా బుద్దుని విగ్రహాలను పూజించడం , బోధిసత్యులను నమ్మటం (పూర్వజన్మలలోని బుద్ధుని రూపాలను బోధిసత్యులని పిలుస్తారు.)

కుడ్యచిత్రకళ : అజంతా గుహలు కుడ్యచిత్రాలను, శిల్పకళానైపుణ్యానికి ప్రసిద్ది చెందినవి. మొత్తం 16 గుహలలో చిత్రాలున్నవి కాని, 16,17 గుహలలో చిత్రాలు మాత్రమే ప్రస్తుతం చక్కగా కనిపిస్తున్నవి. ఈ గోడల మీద గీసిన చిత్రాలు బుద్ధుని జీవితానికి సంబంధించినవి. బుద్ధుని వివిధ రూపాలు, రేఖాగణిత చిత్రాలు, పువ్వులు,పక్షులు, ఎగిరే దేవతలు, జంతువుల బొమ్మలను చిత్రించారు.
padmapaniఒకటో గుహలో వెనుక వరండా గోడమీద ఇద్దరు బోధిసత్వులు కనిపిస్తారు. ఎడమపక్క తపోభంగిమలో అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్న పద్మపాణి, కుడివైపున సర్వాలంకార భూషితుడైన వజ్రపాణి రూపంలో బుద్ధుడు దర్శనమిస్తాడు. ఇవి అజాంతా గుహలలో కెల్లా ప్రసిద్ధ కళాఖండాలుగా చెప్పవచ్చు. ముఖద్వారానికి ఎడమ వైపున ఉన్న చిత్రాలు శిబి చక్రవర్తి జాతక కధకు సంబంధించినది. తనను శరణువేడిన పావురాన్ని రక్షించటానికి తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన చక్రవర్తి శిబి.
గదిలోని పక్కగోడలపై బుద్దుని జీవితంలోని ప్రముఖ ఘట్టాలను పెద్దవిగా చిత్రీకరిచారు. బుద్దుడి రాజ్యాన్ని వదలి వెళ్లే చిత్రము మొదలగునవి. చివరి చిత్రం ధ్యానముద్రలో ఉన్న బుద్ధునిది. ఈ ధ్యాన ముద్రలో ఉన్న చిత్రం నేత్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి.

రెండో గుహలో వరండా పైకప్పు అందమైన చిత్రాలతో నిండి ఉంది. మండపంలో ఎడమ వైపు బుద్ధుని జన్మవృత్తాంతం చిత్రించి వుంది. గది తలుపు పై వైపున బోధిసత్వుడు స్వర్గంలో ఉన్నట్లు కన్పిస్తుంది. ముందు వరండా కుడిగోడమీద శిథిలావస్ధలో ఉన్న చిత్రాన్ని చూడవచ్చు. అత్యున్నతమైన కళాఖాండాలలో ఒకటిగా దీన్ని గుర్తించారు.
ఇక 16వ గుహ వాకాటక రాజుల కాలానికి చెందిన వాటిలో మొదటిది. వీటిని చిత్రాలు చాలావరకు శిధిలావస్ధలో ఉన్నాయి. బుద్ధుని జీవిత గాథలను తెలిపే వాటిల్లో కొన్ని మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. బాలుడిగా గౌతముడు విలువిద్యనభ్యసించే చిత్రం, పొలాలలో అలసిన పనివారు, గాయాలతో బాధపడుతున్న ఎద్దు మొదలగునవి. బుద్దుడు తన సోదరుడైన నందుని మనస్సు మార్చే చిత్రం ఎంతో మనోహరంగా ఉంటుంది. మరణించే రాకుమారి చిత్రం నందుని భార్యది. 17వ గుహ ఆకారంలో 16వ గుహను పోలి ఉంటుంది. ఈ గుహలోని చిత్రాలు ఎక్కువగా పాడైపోలేదు. వరండా గోడమీద బుద్ధుని జీవితంలోని విభిన్న దశలను చూపించే జీవిత చక్రాన్ని ఇందులో చూపించారు. ఇది ఇప్పటికీ టిబెట్లోని బౌద్ధారామాల్లో కనిపిస్తుంది. వరండా కుడివైపు గోడమీద మదపుటేనుగును అదుపులోకి తెస్తున్న చిత్రం ఉంది. బుద్దుడు చేసిన అష్టఅద్భుతాల్లో ఇది ఒకటిగా చెబుతారు.

ajantha sundari చతురస్రాకారంలో ఉన్న ఓ స్ధంభంమీద ఓ పడుచు అద్దంలో తన సౌందర్యాన్ని సవరించుకోంటున్న దృశ్యం మనోహరంగా చిత్రించబడింది. అజంతా సుందరి అంటూ దీన్నే ఉదాహరణగా చూపిస్తారు. గుహ గోడలు కూడా జాతక కథలు చూపించే చిత్రాలతో ఉన్నాయి. ఎగిరే అప్సరస, బుద్దుని ముందు నిలబడ్డ తల్లీ తనయుల చిత్రాలు, బిక్షా పాత్రతో రాజ్మహల్ ద్వారం దగ్గరకు వచ్చిన బుద్ధుని చిత్రాలు చూపరులకు కనువిందు చేస్తాయి.


ajantha paintingఅజంతా చిత్రాలలోని స్త్రీలు ఎంతో అందంగా ఉంటారు. చాలామంది స్త్రీలు నలుపురంగులో కళకళలాడుతూ ఉంటారు. స్త్రీ పురుషులు రకరకాల ఆభరణాలను ధరించి ఉంటారు. ఈ గుహలు మతపరమైనవి. కాని శృంగారం ఉట్టిపడే స్త్రీలను, అంత:పుర స్త్రీలతో గడిపే రాజులనూ చిత్రీకరించడం ఆశ్ఛర్యం కలిగిస్తుంది. వీటి ద్వారా ఆ కాలం నాటి నాగరికత, ఆభరణాలను గమనించవచ్చు.
తరువాత పేజీలో......