అండమాన్ మరియు నికోబార్ దీవులు పరిశుభ్రమైన ఇసుక కల బీచ్ లు. మీరు స్కూబా డైవింగ్ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించవచ్చు.
ఈ దీవులలో అతి విశాలమైన దట్టమైన అరణ్యాలు కూడా ఉన్నాయి. వీటిలో వందలాది విభిన్న జాతుల పక్షులు, పూలు వంటివి ప్రత్యేకించి హనీమూన్ జంటలకు కనుల పండుగ. ఇక్కడి పర్యావరణం స్నేహపూరితంగా ఉండి, నగరాలనుండి పొందలేని కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు మొదలైనవి అస్వాదించవచ్చు.
ఇక్కడి అడవులలో సుమారు 2200 మొక్కల జాతులు గుర్తించబడ్డాయి.
అండమాన్ మరియు నికోబార్ దీవులు అలంకరణకు ప్రసిద్ధి గాంచిన షెల్ ఫిష్ లేదా ఓస్టర్లకు అతి పెద్ద మార్కెట్. హేవ్ లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్ ను, టైమ్ మేగజైన్ వారు ఇటీవల ఆసియాలోనే అతి గొప్పదైన బీచ్ గా వర్ణించారు. హేవ్ లాక్ బీచ్ తన సుందరమైన నీటి ప్రవాహాలతో అనేక జలచరాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంకా సెల్యులర్ జైల్. కోరల్ రీఫ్స్, లిటిల్ అండమాన్, దిగ్లీపూర్, నీల్ ద్వీపం దర్శించతగినవి.
జాలీబాయ్ ఇంకొక పేరుపొందిన ద్వీపం. జాలీబాయ్ ద్వీపం పక్కనే కల హేవ్ లాక్ దీవి మరియు సింకే దీవిలతో కూడా కలిపి మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ గా చెపుతారు. ఈ పార్క్ నే వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కాలుష్యం ఏ మాత్రం లేకుండా, స్వచ్ఛమైన మరియు నిర్మలమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతం పర్యాటకుల స్వర్గం.
ఇక్కడి జలచరాల జీవనం, స్వచ్ఛమైన అనేక పగడపు దిబ్బలు, మొక్క మరియు జంతు శ్రేణులు వంటివి ఈ ప్రాంతంలో మరెక్కడా లభించవు.
అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం పెద్ద మార్పులు లేకుండా సంవత్సరమంతా ఒకే విధమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ దీవులను సందర్శించాలంటే అక్టోబర్ నుండి మే వరకు అనుకూలం. ఈ సమయంలో ఇక్కడ వార్షిక పర్యాటక ఉత్సవాలు జరుగుతాయి. అంతే కాక ఈ సమయంలో చక్కటి వర్షాలు పడి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. బీచ్ లో ఒక రోజు గడపాలంటే ఏ మాత్రం వేడిగా ఉండదు.
Andaman and Nicobar Islands are the most sought-after attractions
Andaman and Nicobar Islands are clean sandy beaches. Whether you can scuba diving or explore the underwater world, or visit the islands to explore the wealth of plants and animals there.
The islands have the most density forests. Hundreds of different species of birds and flowers such as festivals, attracts especially honeymoon couples. Environment here is friendly and can be enjoyed by pure air, light and water that can not afford the cities.
About 2200 species of plants are found in the forest.
Andaman and Nicobar Islands is the largest market for shellfish or oysters famous for decorating. Recently described as the largest beach in Asia by Time Magazine. It is home to the Radhanagar beach in Havelock Island. The Havelock Beach attracts tourists with its many beautiful water streams. Cellular jail, Coral Reefs, Little
Jollyboi is another notable island. Mahatma Gandhi Marine National Park, along with the island of Havelock Island and Neil Island, adjacent to Jollyboi Island. This park is also known as the Wandoor Marine National Park. Without any pollution, the place is a haven for tourists due to the clean and serene atmosphere.
The aquatic life, the pure many coral reefs, plant and animal ranges are not available anywhere else in the area.
Andaman and Nicobar islands have the same climate throughout the year without major changes. The best time to visit the islands is from October to May. Annual tourist festivals are held here during this time. Moreover, the best rainfall during this time is water very pure. One day on the beach is not hot.