india tour header

బిష్ణుపూర్‌ టెంపుల్‌ / Bishnupur Temple, West Bengal

బిష్ణుపూర్‌ టెంపుల్‌ / Bishnupur Temple, West Bengal
బిష్ణుపూర్‌ టెంపుల్‌ - టెర్రకోట మందిరాలు, పశ్చిమ బెంగాల్‌లో పశ్చిమ బెంగాల్‌లో టెర్రకోట టెంపుల్స్‌ సముదాయాలు ఎక్కువ. వీటిలో బిష్ణుపూర్‌ ఆలయం ప్రఖ్యాతిగాంచినది. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ టెర్రకోట మందిరాలు అలనాటి సాంస్కృతిక కళావైభవంతో అలరారు తున్నాయి. బిష్ణుపూర్‌ టెంపుల్‌ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ ప్రాంతం కళల కాణాచి, విశ్వవిద్యాలయాలకు, ప్రాచీన సాంస్కృతిక విద్యాలయాలకు పెట్టింది పేరు. బిష్ణుపూర్‌ నుంచి అరమ్‌బాగ్, దుర్గాపూర్, అసన్‌సోల్, కోల్‌కత్తాకు రోడ్డుమార్గాలున్నాయి. బిష్ణుపూర్‌కు కలకత్తా నుంచి రైలు సదుపాయాలున్నాయి. బిష్ణుపూర్‌ మందిరానికి చేరుకోవాలంటే పట్నం నుంచి ఆటో–రిక్షాలలో బయల్దేరవచ్చు. కాలుష్యరహితంగా ఉంచాలనే ధ్యేయంతో ఇక్కడకు మోటార్‌వాహనాలను అనుమతించడం లేదు. సమీప ఎయిర్‌పోర్ట్‌ కోల్‌కతా. ఇక్కడ నుంచి బిష్ణుపుర్‌ 140 కిలోమీటర్లు. ఆకర్షణీయప్రదేశాలు: రస్‌మంచా, పంచరత్న టెంపుల్, పతార్‌ దర్వాజ, గడ్‌ దర్వాజ, దాల్‌మండల్‌ కమాన్, స్టోన్‌ చారియట్, నూతన్‌ మహల్, చిన్నమస్త టెంపుల్‌.