india tour header

చిరపుంజీ / Chirapunji

చిరపుంజీ

చిరపుంజీ మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక పట్టణం.భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా పేరు గాంచినది. చిరపుంజీకి సమీపంలో ఉన్న మౌస్నారామ్ లో అత్యధిక వర్షపాతం ఉంటుంది.

ఒకప్పుడు చిరపుంజీ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పడే ప్రాంతంగా పేరుపొందింది. అసలు పేరు సోహ్రా. బ్రిటీష్ వాళ్ళ కాలంలో వారికి సరిగా పలకడం చేతకాక సోహ్రానే చిర్రపుంజీగా చినపుంజీగాను పలికారు. తరువాత చిరపుంజీగా స్థరపడిపోయింది. చిరపుంజీలో మార్చినుండి అక్టోబరు వరకు వర్షాకాలమే. మిగతా నెలలో కూడా అప్పుడపుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఈ కొండలలో ఆర్కిడ్ మరియు ఫెర్న్ మొక్కలు కనువిందు చేస్తాయి. చిరపుంజీలో దట్టమైన అడవులు ఉండవు. అన్నీ చిన్న చిన్న మొక్కలే. కమలా ఫలాలు, ఫైనాపిల్ తోటలకు ఈ ప్రాంత ప్రసిద్ధి చెందినది.

ఖాసిం కొండల అంచులో ఉన్న చిరపుంజీ చుట్టూ లోతైన లోయలే. చుట్టుప్రక్కల అలముకున్న మేఘాలు కాస్త ఎత్తున్న ప్రదేశానికి రాగేనే వర్షం పడుతుంది. చిరపుంజిలో నాహ్ కాలికాక్ష్ జలపాతం చూసి తీరవలసిందే. ఈ జలపాతం ప్రపంచంలోలో నాలుగల ఎత్తయిన జలపాతం. మరొక జలపాతం నాహ్సింగ్ టియాంగ్ ఫాల్స్.

మరొక చూడ దగిన ప్రదేశం మాస్మయి గుహ. గుహలోపలంతా చీకటి. సున్నపురాతితో ర్పడిన ఈ గుహలో అంతా చీకటే.

తరువాత చూడదగినది రామకృష్ణా మిషన్ 2009 లో చిరపుంజీలో మంచువర్షం కురినిన చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. చిరపుంజీ ప్రజల సంస్కృతికి సంబంధించిన చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.
చిరపుంజాలో నివసించే స్థానికులను ఖాసీలంటారు. వీరిలో మాతృస్వామ్యం ఉంది. పెళ్ళతరువాత భర్త అత్తగారి ఇంటికి వెళతాడు. తల్లిపేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. చిరపుంజీ లివింగ్ వంతెనలకు పేరు. చిరపుంజీవాసులు చెట్ల వేర్లనే వంతెనులుగా మార్చే విధానాన్ని ఎప్పటినుండో పాటిస్తున్నారు. ఇప్పటికీ ఉపయోగిస్తున ఒక వంతెన 500 సంవత్సరాల క్రితం దని చెబుతారు.

వసతి సౌకర్యం :
చిరపుంజీలో అనేక ప్రవేటు వసతి గృహాలు, సర్క్యట్ హౌస్ డాక్ బంగ్లాలు కలవు.

ఎలా వెళ్ళాలి :
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు కేవలం 58 కి.మీ దూరంలో ఉంటుంది చిరపుంజీ. బస్సులు, ఇతర వాహనాలలో వెళ్ళవచ్చు.