india tour header

నుబ్రావ్యాలీ (లఢక్) / Nubra Valley, Ladak"

నుబ్రావ్యాలీ (లఢక్) / Nubra Valley, Ladak
ప్రకృతిప్రేమికులను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి నుబ్రావ్యాలీ సొంతం. మాటల్లో చెప్పలేని ప్రకృతి అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. సమీప ఎయిర్‌పోర్ట్‌ లేహ్‌లో ఉంది. ఇక్కడి ‘కౌశక్‌ బకులా రిన్‌పోచే’ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నుబ్రావ్యాలీకి 120 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జీప్‌లో వ్యాలీకి వెళ్లేమార్గం అత్యద్భుతంగా ఉంటుంది. రైలుమార్గంలో వెళ్లాలంటే జమ్మూలోని ‘టవి’కి వెళ్లాలి. ఇక్కడ నుంచి నుబ్రా 620 కిలోమీటర్లు. నుబ్రావ్యాలీ మంచు ప్రదేశం. బస్సు సదుపాయాలు తక్కువ. జీపుల్లోనే ఈ వ్యాలీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రక్స్, మిలటరీ వాహనాల వల్ల బస్సులు చాలా చోట్ల ఆగిపోయే అవకాశం ఉంది.నుబ్రావ్యాలీ చేరుకున్న పర్యాటకులు ఖర్దుంగా వద్ద మిలిటరీ పాసులు తీసుకొని, ఫొటోల కోసం అనుమతి పొందాలి. ఈ ప్రాంతంలో కాశ్మీర్‌ శాలువాలు, బాదంపప్పులు, ఆప్రికాట్‌లను కొనుగోలు చేయవచ్చు. కుంకుమపువ్వు తోటల పెంపకాన్ని దగ్గరగా పరిశీలించవచ్చు.