india tour header

Konark, Konark Temple, Sungod Temple

Khajarahoo / కోణార్క్ సూర్యదేవాలయం :
భారతదేశంలోని ప్రముఖ సందర్శనా స్థలాలలో ఒడిషా లోని కోణార్క్ సూర్యదేవాలయం ఒకటి. క్రీ.శ.13వ శతాబ్ధంలో గంగవంశపు రాజైన నరసింహునిచే నిర్మించబడినది. యునెస్కో సంస్థచే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడింది.

ఆలయ విశేషాలు :
సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పసంపదకు నిలయం. 12 జతల అలంకృత చక్రాలతో ఏడు గుర్రాలతో లాగబడుచున్న పెద్ద రథం ఆకారంలో నిర్మించబడినది. ఆలయ నిర్మాణానికి నల్ల గ్రనైట్ రాతిని ఉపయోగించారు. సంవత్సరానికి 12 మాసాలు 12 రాశులు వీటికి అనుగుణంగా మరియు సూర్యుని ఆగమనానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోణార్క్ ఆలయాన్ని చూసిన తరువాత ఇక్కడకు 3 కి.మీ. దూరంలో ఉన్న బీచ్ కు వెళ్ళవచ్చు.కోణార్క్ బీచ్ ఆహ్లాదకరంగా ఉంటుంది. మరియు ప్రపంచ ప్రసిద్ది పొందిన పూరీ జగన్నాధాలయం ఇక్కడకు కేవలం 35 కి.మీ.దూరంలో ఉంది.
వసతి సౌకర్యాలు :
కోణార్క్ లో బస చేయాలనుకున్న వారు ఇక్కడున్న యాత్రీనివాస్, పంత్ నివాస్ లేక ఇతర హోటల్స్ లో ఉండవచ్చు.
ప్రయాణసౌర్యాలు :
కోణార్క్ కు దగ్గరలో ఉన్న విమానాశ్రయం భువనేశ్వర్ 64 కి.మీ. దూరంలో ఉంది. పూరీ, భువనేశ్వర్ నుండి రైలు మరియు బస్సులు ద్వారా వెళ్ళవచ్చు.