india tour header

ఓర్చా, మధ్యప్రదేశ్‌ / Orcha, Madhya Pradesh

ఓర్చా, మధ్యప్రదేశ్‌ / Orcha, Madhya Pradesh
మధ్యప్రదేశ్‌లోని ఓర్చా కట్టడాన్ని బుందేల్‌ ఛీఫ్తాన్‌ రుద్రప్రతాప్‌ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేరొందిన ఈ ప్రాంతానికి సమీప ఎయిర్‌పోర్ట్‌ ఖజురహో. రైల్వేస్టేషన్‌ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ–ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్‌ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్‌ మందిర్, షాహిద్‌స్మారక్‌ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్‌ ఉంది. www.mptourism.com-----